Breaking News

స్పైస్‌జెట్ విమానంలో పనిచేయని ఏసీ.. ప్రయాణికుల అవస్థలు

Published on Wed, 06/19/2024 - 16:13

న్యూఢిల్లీ: విమానంలో సాంకేతిక లోపాలు, అనుచిత ఘ‌ట‌నలు, బెదిరింపు కాల్స్‌.. వంటివి త‌రుచూ చోటుచేసుకుంటున్నాయి.  తాజాగా ఓ విమానంలో ఏసీ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక ఉక్క‌పోత‌తో కొందరు అవస్థలు పడ్డారు. ఈ ఘ‌ట‌న స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది.

న్యూ ఢిల్లీ నుంచి దర్బంగా వెళుతున్న‌ SG 476 విమానంలో సుమారు గంటకు పైగా ఏసీ పని చేయలేదు దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు. వెంటిలేష‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌  గాలి కోసం తమ చేతిలో ఉన్న వస్తువులతో విసురుకుంటూ కనిపించారు. వృద్ధులు చిన్నపిల్లలతో సహా అనేక మంది ప్రయాణీకులు ఉక్క‌పోత‌తో అవస్థలు ప‌డ్డారు. విమానంలోని పరిస్థితిని తోటి వారు డియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

"నేను ఢిల్లీ నుంచి దర్భంగాకు స్పైస్ జెట్‌లో ప్రయాణిస్తున్నాను. ఢిల్లీ విమానాశ్రయంలో చెక్ ఇన్ తర్వాత గంట వ‌ర‌కు ఏసీ ఆన్ చేయ‌లేదు. విమానం లోప‌ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంది. విమానం టేకాఫ్‌ కాగానే ఏసీ ఆన్ చేశారు’’ అని ప్రయాణీకుడు రోహన్‌కుమార్ తెలిపారు.

 వీడియోపై స్పందించిన విమానయాన సంస్థ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్యతో ఈ పరిస్థితి నెలకొందని, ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)