Breaking News

‘అయోధ్య దీపోత్సవ్‌కు ఆహ్వానం అందలేదు’

Published on Wed, 10/30/2024 - 15:57

లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను నిర్వాహకులు ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తెలిపారు. మన పండుగల విషయంలో కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు.  ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలందారికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేసి ప్రజలను విభజిస్తోంది. నాకు దీపోత్సవ్‌కు పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. 

..నేను ఈరోజు అయోధ్యకు వెళ్తున్నా. నాకు నిర్వాహకుల నుంచి దీపోత్సవ్‌ కార్యక్రమానికి ఎటువంటి పాస్ లేదా ఆహ్వానం రాలేదు’’ అని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అయోధ్యలో అట్టహాసంగా  నిర్వహించనున్న దీపోత్సవ్‌ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు సరయూ నది ఒడ్డున సుమారు 28 లక్షల దీపాలను వెలిగించటం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)