Breaking News

రేపు కేరళను తాకనున్న నైరుతి

Published on Wed, 06/03/2026 - 05:17

న్యూఢిల్లీ: భారత్‌లో పంటసాగుకు ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు జూన్‌ నాలుగోతేదీన కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. సాధారణంగా జూన్‌–సెపె్టంబర్‌ సీజన్‌కు సంబంధించిన నైరుతి రుతుపవనాలు జూన్‌ ఒకటోతేదీకల్లా కేరళలో చిరుజల్లులను కురిపిస్తూ రైతన్నల ముఖాల్లో ఆనందం తీసుకొస్తాయి. కానీ ఈసారి నాలుగు రోజులు ఆలస్యంగా భారత్‌లోకి అడుగుపెడుతున్నాయని వాతావరణశాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

‘‘నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్ర, లక్షద్వీప్‌ దీవులు, కేరళలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోలలో ఒకేసారి జూన్‌ నాలుగోతేదీన నైరుతి రుతుపవనాలు తాకే ఆస్కారముంది. నైరుతి, దక్షిణ మధ్య ప్రాంతం, తూర్పు మధ్యప్రాంతం, బంగళాఖాతం ఈశాన్య ప్రాంతాలు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాల్లోనూ అదే తేదీన వర్షాకాల సీజన్‌ ఆరంభంకానుంది. ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్‌పీఏ) 90 శాతంగా ఉండొచ్చు’’అని వాతావరణ శాఖ అంచనావేసింది.

గత 30 లేదా 50 సంవత్సరాల కాలంలో నిర్ణిత ప్రాంతంలో ఒక నెలలో లేదా ఒక సీజన్‌లో పడే వర్షపాతం సగటును ఎల్‌పీఏగా పేర్కొంటారు. 1971 నుంచి 2020 ఏడాది మధ్య నమోదైన ఎల్‌పీఏ 87 సెంటీమీటర్లనే ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈసారి ఎల్‌పీఏ 90 శాతంగా ఉండొచ్చు అంటే ఈసీజన్‌లో లోటు వర్షపాతం నమోదయ్యే ఆస్కారముందని వాతావరణ శాఖ నిపుణులు అంచనావేస్తున్నారు. ఎల్‌ నినో పరిస్థితుల కారణంగానే లోటు వర్షపాతం ముప్పు పొంచి ఉందని నిపుణులు వివరించారు. భూమధ్యరేఖ సమీప పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంత ఉపరితల జలాలు క్రమంగా వేడెక్కుతూ ఎల్‌నినో పరిస్థితులను సృష్టిస్తున్నాయి. జూన్‌లో ఎల్‌–నినో ప్రభావం తక్కువగా ఉండి, సెప్టెంబర్‌లో బలపడే అవకాశముంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)