Breaking News

మళ్లీ సోనూసూద్‌ ఉదారత.. ఈసారి దుబాయ్‌లో..

Published on Thu, 03/05/2026 - 10:51

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం నటుడు, మానవతావాది సోనూ సూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సంక్షోభం కారణంగా దుబాయ్‌లో తలదాచుకుంటున్న పర్యాటకులు, ప్రయాణికులకు ఉచిత వసతి కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ, బాధితులకు అండగా ఉంటానిని భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి సమయంలోనూ సోనూసూద్‌ వందలమందికి సాయం అందించారు.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య  నెలకొన్న యుద్ధ వాతావరణం పశ్చిమాసియాలోని విమానయాన రంగాన్ని అతలాకుతలం చేసింది. ఫిబ్రవరి చివరిలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరిపాయి. దానికి ప్రతిచర్యగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ పరిణామాల దృష్ట్యా భద్రతా కారణాలతో పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడం, విమాన సర్వీసులను రద్దు చేయడంతో దుబాయ్‌లో వేలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు.

విమానాల రద్దు, దారిమళ్లింపుల వల్ల విమానాశ్రయాల్లోనే గంటల తరబడి నిరీక్షిస్తున్న బాధితుల కష్టాలను చూసి సోనూ సూద్ స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులతో పాటు ఏ దేశానికి చెందిన వారైనా సరే, దుబాయ్‌లో వసతి లేక ఇబ్బంది పడుతుంటే తనకు నేరుగా మెసేజ్‌ పంపాలని సోనూ సూద్ కోరారు. బాధిత ప్రయాణికులు తమ స్వదేశాలకు చేరుకునే వరకు వారికి ఉచిత వసతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘మానవత్వానికి దేశ సరిహద్దులు, నిబంధనలు ఉండవు’ అని పేర్కొంటూ, దుబాయ్‌లో ఆశ్రయం అవసరమైన వారు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించాలని సూచించారు.
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)