ఆర్పీఎఫ్‌ తొలి మహిళా సారధిగా సోనాలి మిశ్రా

Published on Sun, 07/13/2025 - 11:32

న్యూఢిల్లీ: మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. భారత సైన్యంలోనూ ప్రవేశించి, తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు సీనియర్ ఐపీఎస్‌ అధికారిణి సోనాలి మిశ్రా.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్‌) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. జూలై 31న పదవీ విరమణ చేయనున్న మనోజ్ యాదవ్ స్థానంలో ఆమె ఈ పదవిని చేపడుతున్నారు.

సోనాలి మిశ్రాను  ఈ పదవిలో నియమించేందుకు క్యాబినెట్ నియామకాల కమిటీ అధికారికంగా ఆమోదం తెలిపింది. సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం 2026, అక్టోబర్ 31 వరకూ అంటే పదవీ విరమణ చేసే వరకు సోనాలి మిశ్రా ఈ పదవిలో కొనసాగనున్నారు. రైల్వే ఆస్తులను కాపాడటం, ప్రయాణికుల భద్రత తదితర విధులతో పాటు, వాటి బాధ్యతలను అధికారులకు అప్పగించే విషయంలో ఆర్పీఎఫ్‌కు సోనాలీ మిశ్రా తొలి మహిళా అధికారిగా విధులు నిర్వహించనున్నారు.

సోనాలి మిశ్రా మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్‌) అధికారిణి. ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసు విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ (సెలక్షన్)గా పనిచేస్తున్నారు. కాగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్‌)1957లో పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటయ్యింది. దీనికి 1985, సెప్టెంబర్ 20న యూనియన్ సాయుధ దళం హోదా ఇచ్చారు. 2021 జూలైలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) ఏర్పాటుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా కమాండర్‌గా సోనాలి మిశ్రా పేరొందారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)