‘శిరోముండనం’ ప్రకటన వెనక్కి తీసుకున్న ఆప్‌ నేత

Published on Mon, 06/10/2024 - 11:21

ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎంపికైతే తాను శిరోముండనం చేయించుకుంటానని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి ఇప్పుడు తన నిర్ణయంపై యూ టర్న్‌ తీసుకున్నారు. అంతేకాదు దీనివెనుకగల కారణాన్ని కూడా వివరించారు.

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ఆప్ నేత సోమనాథ్‌ భారతి ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడిన రోజున ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ మూడోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపధ్యంలో పలువురు సోమనాథ్‌ భారతిని శిరోముండనం ఎప్పుడు చేయించుకుంటారని అడుగుతున్నారు.

ఈ నేపధ్యంలో సోమనాథ్ భారతి దీనికి సమాధానమిస్తూ, తాను శిరోముండనం చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ప్రధాని మోదీ తన సొంత సత్తాతో విజయం సాధించలేదని, ఇది ఎన్డీఏ మిత్రపక్షాల ఏకీకృత విజయమేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌  వెలువడిన సమయంలో ఢిల్లీ లోక్‌సభ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ప్రకటించారు.

జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత ఎగ్జిట్ పోల్స్  తప్పని తేలిపోతుందని సోమనాథ్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏడు స్థానాల్లో భారత కూటమి విజయం సాధిస్తుందని కూడా సోమనాథ్ భారతి చెప్పారు. కాగా న్యూఢిల్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ చేతిలో సోమనాథ్‌ భారతి ఓటమి పాలయ్యారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)