Breaking News

‘దేశంలో ఎక్కడో లోపం ఉంది’: ఎంపీ శశి థరూర్

Published on Sun, 09/28/2025 - 15:41

తిరువనంతపురం: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విచారం వ్యక్తం చేశారు. కేరళలోని తిరువనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఇది చాలా విషాదకర పరిస్థితి. మన దేశంలో జనసమూహ నిర్వహణలో ఏదో లోపం ఉంది. ప్రతి ఏటా ఇలాంటి ఏదో ఒక ఘటన జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఇదే సమయంలో బెంగళూరు ఘటన గుర్తుకువస్తోంది. ఈ తొక్కిసలాటల్లో పిల్లలు కూడా చనిపోతున్నారని విన్నప్పుడు  హృదయం ద్రవించిపోతోంది’ అని థరూర్  ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాడులోని కరూర్‌లో నటుడు, రాజకీయ నేత విజయ్ సారధ్యంలో జరిగిన ర్యాలీలో భారీ రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగి, 40 మంది మృత్యువాపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మొదలుకొని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎంపీ శశి థరూర్ ‘భవిష్యత్తులో ఇటువంటి  ఘటనలు జరగకుండా ఉండేందుకు, భారీ సమావేశాల విషయంలో కఠినమైన నియమాలను, భద్రతా ప్రోటోకాల్‌లను రూపొందించాలి. సాధారణ ప్రజానీకాన్ని రక్షించేందుకు జాతీయ స్థాయిలో  క్రమబద్ధమైన విధాన రూపకల్పనకు ఏమి చేయగలం అని ఆలోచించాలి.

జనం అటు సినిమా నటుడైనా, ఇటు రాజకీయ నేత అయినా వారి మాటలు వినడానికి ఉత్సాహంగా బహిరంగ సభలకు హాజరవుతుంటారు.  ఇటువంటి సందర్భాల్లో  కొన్ని నియమాలు, ప్రమాణాలు, ప్రోటోకాల్‌లు అమలులో ఉండాలి. అదే సమయంలో తొక్కిసలాటలో అయినవారిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాలి.  ఏదిఏమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనసమూహాన్ని నియంత్రించేందుకు కఠినమైన విధానాలను తీసుకురావాలి.  ఇందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలని కోరుతున్నానని శశిధరూర్‌ పేర్కొన్నారు.

తమిళనాడులోని కరూర్‌లో తమిళగా వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్  చేపట్టిన ర్యాలీలో జరిగిన  తొక్కిసలాటలో 40 మంది మృతిచెందారు. 70 మంది గాయపడ్డారు.ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రూ. రెండు లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన  ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున అందిస్తున్నట్లు ప్రకటించారు. నటుడు విజయ్ కూడా బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షలు చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)