మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
Solar Eclipse 2023: సూర్యగ్రహణం రోజు గర్భిణీలు ఈ పనులు చేయొద్దు..!
Published on Wed, 04/19/2023 - 12:21
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న, రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14న ఉన్నాయి. ఈ రోజు గర్భిణీలు అసలు బయటకు రాకూడదని ప్రాచీన కాలం నుంచి విశ్వసిస్తున్నారు. గ్రహణం వల్ల కడుపులోని బిడ్డకు హానికరం అని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. అందుకే సూర్యగ్రహణం సమయంలో గర్భంతో ఉన్న మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆరోజు వాళ్లు ఏమేం చేయకూడదో చెప్పారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
గ్రహణం వేళ గర్భిణీలు చేయకూడనివి..
► సూర్యగ్రహణం పూర్తయ్యే వరకు గర్భిణీలు ఇంటి లోపలే ఉండాలి. ఈ సమయంలో బయటకు వెళ్తే పట్టుబోయే బిడ్డకు, తల్లికి హానికరం అని ప్రాచీన విశ్వాసం. గ్రహణం నీడ మీద పడినా కూడా తల్లీబిడ్డలకు మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు.
► సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అసలు చూడవద్దు. చూస్తే కళ్లతో పాడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
► గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం తినొద్దు. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వసిస్తారు. ఈ సమయంలో బాగా ఆకలివేసి తప్పనిసరిగా తినాల్సి వస్తే మాత్రం పండ్లను శుభ్రంగా నీటితో కడిగి తినాలని పెద్దలు సూచిస్తున్నారు.
► గ్రహణం సమయంలో వీరు నిద్ర కూడా పోవద్దు.
► సూదులు, కత్తెర్లు, కత్తులు వంటి వస్తువులను గ్రహణం సమయంలో అసలు ఉపయోగించవద్దు. ఇలా చేస్తే కడుపులోని బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
► కత్తులు, పదునైన ఆయుధాలను అసలు ముట్టుకోకూడదు. గ్రహణం సమయంలో కత్తితో పండ్లు, కూరగాయలు కట్ చేయడం వంటి పనులు చేస్తే.. బిడ్డ పట్టేటపుడు అవయవాలు చీలి పోతాయి. అంటే శిశువులు పెదాలు చీలి పోయి జన్మించడం వంటివి జరగవచ్చు.
► గ్రహణం సమయంలో శారీ పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు కూడా ధరించకూడదు.
► ఈ సమయంలో గర్భిణీలు దుర్వ గడ్డి(గరికె)పై మంచం వేసుకొని కూర్చుని సంతాన గోపాల మంత్రాన్ని జపిస్తే మంచిది.
ఈ విశ్వాసాలు నిజం కాదని శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. అయినప్పటికీ గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. గ్రహణం అనేది సహజ చర్యకు విరుద్ధం కాబట్టి కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చని, కానీ ఏమేరకు హాని కలుగజేస్తాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్యులు చెప్పేవి వాస్తవం కాదంటున్నారు.
కాగా.. ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. ఏప్రిల్ 20న మొదటి, అక్టోబర్ 14న రెండో సూర్యగ్రహణం ఉంది. మే 5-6 మధ్య మొదటి చంద్ర గ్రహణం, అక్టోబర్ 28-29 మధ్య రెండో చంద్ర గ్రహణం ఉన్నాయి. అయితే మొదటి సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, సౌత్, ఈస్ట్ ఆసియా దేశాల్లో మాత్రమే కన్పించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్‍లో కన్పించకవోచ్చని పేర్కొన్నారు.
చదవండి: పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారంటే..?
Tags : 1