Breaking News

పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర

Published on Mon, 10/07/2024 - 07:22

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు జరుగుతున్న కుట్రలు ఆగడంలేదు. తాజాగా ఇటువంటి ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే రైలును ఆపాడు. ఈ ఘటనను పోలీసులు ధృవీకరించారు.

ఖీరోన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌హెచ్‌ఓ) దేవేంద్ర భడోరియా మాట్లాడుతూ డంపర్ నుండి రైల్వే ట్రాక్‌పై ఇసుక పోశారని, దానిని తొలగించిన తరువాత రైలు ముందుకు సాగిందన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, దీనిలోభాగంగా మట్టిని రవాణా చేసే పని రాత్రిపూట జరుగుతున్నదన్నారు. ఈ నేపధ్యంలోనే ఓ డ్రైవర్ డంపర్ నుంచి ఇసుకను రైల్వే ట్రాక్‌పై పోసి  అక్కడినుంచి పరారయ్యాడన్నారు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత రాయ్ బరేలీ- రఘురాజ్ సింగ్ స్టేషన్ మధ్య నడుస్తున్న షటిల్ రైలు  ఈ రూట్‌లో వచ్చిందన్నారు.  

అయితే ఆ రైలు లోకో పైలట్ రైల్వే ట్రాక్‌పై మట్టిని గమనించి, రైలును ఆపాడని దేవేంద్ర భడోరియా తెలిపారు. లోకో పైలట్  అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని, రైల్వే ట్రాక్‌పై మట్టిని తొలగించిన తర్వాత రైలు నెమ్మదిగా ముందుకు కదిలిందన్నారు. ఈ సమయంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గేట్‌మెన్ శివేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ  రైలు వేగం తక్కువగా ఉన్నకారణంగానే ప్రమాదం తప్పిందని, ఒకవేళ వేగం ఎక్కువగా ఉంటే రైలు పట్టాలు తప్పేదన్నారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టు వెలుపల పేలుడు.. ఇద్దరు మృతి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)