Breaking News

స్వాతి మలివాల్‌ వర్సెస్‌ రేఖాశర్మ.. సోషల్‌ మీడియాలో డైలాగ్‌ వార్‌

Published on Sun, 02/04/2024 - 19:32

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీగా కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత స్వాతిమలివాల్‌ ప్రమాణస్వీకారంపై వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఆమెపై జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ ట్రోల్‌ చేస్తూ ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘స్వాతిమలివాల్‌ ఆందోళనల్లో నుంచి పుట్టిన ప్రోడక్టు. ఆమెకు నినాదాలు మాత్రమే తెలుసు. ఆమె తన చిన్న మెదడును అసలే వాడదు. బడ్జెట్‌ అంటే ఆమెకు ఏం తెలియదు.

అయినా బడ్జెట్‌పై ఆమె నిపుణురాలు అనుకుంటోంది’ అని పోస్టులో రేఖాశర్మ వ్యంగ్యాస్రాలు సంధించింది.రేఖాశర్మ పోస్టుపై స్వాతిమలివాల్‌ అంతే ఘాటుగా స్పందించారు. ‘నేను ఆందోళనల్లో నుంచి పుట్టానని గర్వంగా చెప్పుకుంటున్నాను. నా జీవితం సామాజిక సేవకు అంకితం చేశాను.మహిళా కమిషన్‌ చైర్మన్‌గా మీరు ఫెయిల్‌ అయ్యారు. వెంటనే మీరు మీ పదవికి రాజీనామా చేసి ట్రోలింగ్‌ చేసుకోండి’అని రేఖాశర్మపై స్వాతి ఫైర్‌ అయ్యారు.

జనవరి 31న రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన స్వాతిమలివాల్‌ చివర్లో ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదమిచ్చారు.దీనిపై రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ దన్‌కడ్‌ అభ్యంతరం తెలిపారు. మళ్లీ ఆమెతో ప్రమాణం చేయించారు. తొలిసారి చేసిన ప్రమాణస్వీకారాన్ని రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించారు. స్వాతిమలివాల్‌ గతంలో ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేయడం గమనార్హం.     

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)