Breaking News

పాము గుడ్లు కూడా విషపూరితమేనా? తింటే ఏమవుతుంది?

Published on Wed, 12/11/2024 - 10:32

పాము.. ఈ మాట వినగానే చాలామంది భయపడిపోతుంటారు. కొందరు పామును చూస్తే వణికిపోతారు. పాము సంగతి పక్కనుంచి దాని గుడ్లు విషయానికొస్తే పలువురిలో అనేక అనుమానాలున్నాయి. పాము గుడ్లు తినవచ్చా? లేదా అనేదానిపై చర్చలు కూడా సాగుతుంటాయి.

మన దేశంలో కోడి గుడ్లకు విపరీతమైన క్రేజ్ ఉంది.  చాలా రకాల ఆహారాలలో గుడ్లను విరివిగా వాడుతుంటారు. అలాగే బాతు, ఉష్ట్రపక్షి గుడ్లను కూడా తింటుంటారు. వీటి గుడ్లను తిన్నప్పుడు మరి పాము గుడ్లు తింటే ఏమవుతుంది? దీనికి మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ నివాసి, స్నేక్‌ క్యాచర్  మహదేవ్ పటేల్ సమాధానం తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన పాము గుడ్లను మనిషి తినడం అనేది అసాధారణమైన ఘటన అని,  ఎవరైనా పాము గుడ్డు తింటే, పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి  ఉంటుందని ఆయన తెలిపారు. పాము గుడ్లలో బ్యాక్టీరియా లేదా పరాన్నజీవులు ఉంటాయని, ఇవి ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయని మహదేవ్‌ పటేల్‌ వివరించారు.

సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా పాము గుడ్లలో ఉంటుందని, ఇది ఆహారాన్ని కలుషితం చేస్తుందన్నారు. పాము గుడ్లు తినడం వల్ల అలెర్జీ వస్తుందని, ఇది చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస సమస్యలు లేదా అనాఫిలాక్సిస్ లాంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందన్నారు. పాము గుడ్లలో విషం ఉండదని, అందుకే వాటిని తిన్న వ్యక్తి మరణించడని మహదేవ్‌ తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాముల గుడ్లలో విషం ఉండదు, ఎందుకంటే పాము కోరల వెనుక ఉన్న గ్రంధులలో విషం తయారవుతుంది. ఇది గుడ్డు దశలో ఏర్పడదు. పాము గుడ్లు తినడం వల్ల మనిషి శరీరంలోకి విషం ప్రవేశించే అవకాశాలు చాలా తక్కువ.

భారతదేశంలో పాములను పూజిస్తారు. అందుకే దాని గుడ్లు తినడం  అనే ఆలోచన చేయరు. అయితే విదేశాల్లో పాము గుడ్లు తింటుంటారు. అక్కడివారు పాము గుడ్లను తినాలనుకున్నప్పుడు వాటిని బాగా ఉడికిస్తారు. తద్వారా దానిలోని బ్యాక్టీరియా, పరాన్నజీవులు నాశనమవుతాయి. మరోవైపు పాము గుడ్లు తినడం సాధ్యమేనని, వాటిలో పోషక విలువలు ఉంటాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే పాము గుడ్డులోని బ్యాక్టీరియా కారణంగా  అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులకు హాని కలిగించడం శిక్షార్హమైన నేరమని మహదేవ్ పటేల్ తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘ఇండియా’కు ఎవరు బెస్ట్‌? రాహుల్‌.. మమత బలాబలాలేమిటి?

#

Tags : 1

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)