ఇదేం ప్రేమ.. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 06/09/2023 - 12:35

న్యూఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనలో భాగంగా నిర్వహించిన మొహబ్బత్ కీ దుకాన్ కార్యక్రమంలో ప్రస్తుత ముస్లింల పరిస్థితి 80వ దశకంలో దళితులను పోలి ఉందని చేసిన వ్యాఖ్యలతో మొదలు, అదేపనిగా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పర్యటనను కొనసాగిస్తున్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నీ ప్రేమంతా రాజకీయాలు చేయడం మీదే ఉంది తప్ప దేశం మీద కొంచెమైనా లేదు..  ఇదేం ప్రేమ.." అంటూ ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. 

ఇదేం ప్రేమ.. 
స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ప్రేమతత్త్వం గురించి మాట్లాడేటప్పుడు అందులో సిక్కుల హత్యల గురించి మాట్లాడారా? ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు మీ హయాంలో జరిగిన రాజస్థాన్ మహిళల కిడ్నాపుల గురించి మాట్లాడారా? హిందువుల జీవన విధానం అస్తవ్యస్తం చేయడం కూడా మీ ప్రేమలో భాగమేనా? దాని గురించి మాట్లాడరేం? భారత దేశం ఎదుగుదలను సహించలేని వారితో చేతులు కలపడం, మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బయటవారి మద్దతు కోరడం ఇవన్నీ మీ ప్రేమలో భాగమేనా? నీ దేశంపై కాకుండా కేవలం నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒలకబోసే ప్రేమ.. ఇదేమి ప్రేమ? అంటూ ప్రశ్నించారు. 

ప్రేమ పేరుతో ద్వేషం పెంచుతున్నారు..  
పది రోజుల యూఎస్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను టార్గెట్ చేస్తూ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిగా బీజేపీ నాయకులు ఒక్కొకరుగా రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. పరాయి గడ్డ మీద ప్రేమ పేరుతో దేశంపై ద్వేషాన్ని పెంచుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు.

   
ఇది కూడా చదవండి: రెండు దేశాలకు మంచిది కాదు.. భారత విదేశాంగ శాఖ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)