Breaking News

సుఖనిద్రకు ‘స్లీప్‌ డైవోర్స్‌’.. భారతీయ భార్యాభర్తలపై సర్వే ఇలా..

Published on Sun, 04/27/2025 - 07:29

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌:  ‘‘నిండార  రాజు నిద్రించు నిద్రయునొకటే / అండనే బంటు నిద్ర అదియునొకటే..’ అని రాశారు అన్నమయ్య. రాజు పోయే నిద్ర, బంటు పోయే నిద్ర... రెండూ ఒక్కటే , నిద్రలో తేడాలు ఉండవు అని అర్థం. రాజు, బంటు వేర్వేరుగా ఎవరి నిద్రలో వారు ఉంటారు కనుక తేడాలు ఉండకపోవచ్చు కానీ, ఒకే పరుపుపై పవళించే భార్యా భర్తల నిద్రల్లో మాత్రం తేడాలు ఉంటాయి. ఇద్దరిలో ఒకరు గురక పెడుతుంటే రెండో వారి నిద్ర పాడవుతుంది. ఏసీ ఎక్కువ తక్కువలు ఇద్దరిలో ఒకరి నిద్రను కబళిస్తాయి. ఫ్యాను స్పీడు, పరుపు గట్టితనం ఇద్దరికీ ఒకే రకంగా అనుకూలంగా లేకుంటే ఇద్దరిలో ఒకరికి నిద్ర కరువవుతుంది. ఇద్దరిలో ఒకరు తెల్లవార్లూ నిద్రలో భంగిమలు మారుస్తుంటే రెండో వారికి కలత నిద్రే మిగులుతుంది.

నయా ట్రెండ్‌... స్లీప్‌ డైవోర్స్‌
‘‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరగదు’’ అనే మాట... కలిసి పడుకునే భార్యాభర్తల విషయంలో మాత్రం నిజం కాదు. నిద్ర పోవటానికి అన్నీ సౌఖ్యంగా ఉన్నప్పటికీ.. ఒకరి సౌఖ్యం ఇంకొకరికి అసౌకర్యం కావచ్చు.  నిద్ర సుఖమెరగదు అనే మాట అర్థం లేనిదవచ్చు. అప్పుడిక ఎవరికి వారుగా, వేర్వేరు పడకలపై నిద్రించటమే.. సుఖనిద్రకు మార్గం. ఇలా వేర్వేరుగా పడుకోవటాన్నే ‘స్లీప్‌ డైవోర్స్‌’ అంటున్నారు!

కాపురాలను నిలబెడుతుంది
భారతీయ దంపతులలో 78 శాతం మంది ‘స్లీప్‌ డైవోర్స్‌’కు మొగ్గు చూపుతున్నారని ‘రెస్‌మెడ్‌’ గ్లోబల్‌ స్లీప్‌ తాజా సర్వే వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం ప్రపంచంలోనే ఇది అత్యధిక శాతం. తర్వాతి రెండు స్థానాల్లో చైనా (67 శాతం), దక్షిణ కొరియా (65 శాతం) ఉన్నాయి.  నిద్రలో గురకపెడుతున్న జీవిత భాగస్వామి నుండి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయిస్తున్న వారికి సైతం, మొదట ఈ ‘స్లీప్‌ డైవోర్స్‌’ను సూచించి కాపురాలను నిలబెడుతున్నారు లైఫ్‌ కోచ్‌లు, సైకో థెరపిస్టులు, ఆధునిక కౌన్సెలర్‌లు. అంటే..  విడాకులను నివారించటం కోసం ‘నిద్ర విడాకులి్న’ తీసుకోవటం! బాగుంది కదా.  

కళకళలాడుతూ నిద్ర లేస్తారు
నిద్ర ఎంత పెద్ద సమస్యో నిద్రాభంగాన్ని అనుభవించేవారికి గానీ తెలియదు. నిద్రలేమి అలసటను కలిగిస్తుంది. క్రమంగా నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేస్తుంది. చివరికి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా తగ్గుముఖం పడుతుంది. అందుకే నిద్రకు ముఖం వాచిన దంపతుల కంటే, కంటి నిండా నిద్రపోయే దంపతులు కళకళలాడుతూ ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. 

కలిసి ఉండేందుకే విడిపోవటం
ఎంత భార్యాభర్తలైనా, ఏ ఇద్దరు మనుషుల శరీర స్వభావాలు, వారి సమయా సమయాలు ఒకటి కాదు కనుక... ఒకే మంచంపై ఇబ్బందిగా, ఇరుకుగా అనిపించినప్పుడు వేర్వేరు గదుల్లో, లేదా వేర్వేరు పడకలపై నిద్రించటమే మంచిదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. స్లీప్‌ డైవోర్స్‌ నిద్ర నాణ్యతను మెరుగు పరుస్తుంది. నిద్రకు అంతరాయాలను తొలగిస్తుంది. మనసుకు, మెదడుకు ప్రశాంతనిస్తుంది. ఎవరికి కావలసి విధంగా వారు గది వాతావరణాన్ని, గదిలోని వెలుతురును అమర్చుకోవటం వల్ల తేలిగ్గా నిద్రపట్టి, దీర్ఘనిద్రలోకి జారి, శరీరానికి సత్తువ లభిస్తుంది.

చిన్న చిన్న సమస్యలూ ఉన్నాయి!
స్లీప్‌ డైవోర్స్‌తో చక్కగా నిద్ర పట్టి రీచార్జ్‌ అవుతున్నప్పటికీ, ఇలా వేరుగా పడుకోవటం అన్నది మానసికమైన ఎడబాటుకు దారి తీసే ప్రమాదం లేకపోలేదని మనో వైజ్ఞానిక నిపుణులు అంటున్నారు. పిల్లలు ఉన్న దంపతులకు ఇంకో సమస్య ఎదురౌతుంది. తల్లిదండ్రులు నిద్ర కోసం విడి విడిగా పడుకుంటున్నారని వారు అనుకోరు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా ఏంటి అని ఊహించుకుంటారు! ఏకాంతంగా ఉండేందుకు దొరికే ఆ కొద్ది గంటల్లో భార్యభర్తలు తమ నిద్రకోసం ఒకరికొకరు దూరంగా ఉండటం వల్ల వారి మధ్య సంభాషణ కూడా తగ్గిపోతుంది. తద్వారా ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన దాంపత్య అనుబంధానికి అవరోధం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా కాస్త జాగ్రత్త పడితే చాలు.  ఏమైనా, నిద్రలేమి ముందు మిగతావన్నీ చిన్న విషయాలు కనుక నిరభ్యంతరంగా ‘స్లీప్‌ డైవోర్స్‌’ను పాటించవచ్చనీ, పాటిస్తూనే ఒకరి అవసరాలను ఒ­క­రు కనిపెట్టుకుంటూ కుటుంబ జీవనాన్ని సాఫీగా కొ­నసాగింవచ్చునని థెరపిస్టులు అభయం ఇస్తున్నారు. 

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)