Breaking News

ధర్మస్థలలో కొనసాగుతున్న తవ్వకాలు

Published on Wed, 08/06/2025 - 08:01

కర్ణాటక :  కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం పరిసరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వందలాది మందిని హత్య చేసి, మృతదేహాలను ఖననం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పారిశుధ్య కార్మికుడు చెప్పిన 13 పాయింట్లకుగాను 10 ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. మంగళవారం 11వ పాయింట్‌లో సిట్‌ అధికారులు, పోలీసులు కూలీలతో తవ్వించారు. అక్కడ అస్థిపంజరాలేవీ లభించలేదని సమాచారం. 

సోమవారం 10వ పాయింట్‌ వద్ద కొన్ని అస్థిపంజరాల అవశేషాలు దొరికాయి. దీంతో మంగళవారం ఇంకా ఎక్కువ ఆధారాలేమైనా దొరుకుతాయా? అనే ఉత్కంఠ ఏర్పడింది. 11వ పాయింట్‌లో రెండున్నర గంటల పాటు ఆరు అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. ఎలాంటి కళేబరాలు లభించలేదు. తరువాత ఆ గుంతను పూడ్చివేశారు. మధ్యాహ్నం తర్వాత 12వ పాయింట్‌లో తవ్వకాలు చేపట్టగా, భారీ వర్షం కురవడంతో ఆటంకం ఏర్పడింది. కార్మికులు మట్టిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటిదాకా ఆరు పాయింట్లలో మానవ అస్థిపంజరాల అవశేషాలు లభించాయి. 13వ పాయింట్‌లో తవ్వాల్సి ఉంది.   

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)