Breaking News

నేటి నుంచి ‘భారత్ పర్వ్’.. 31 వరకూ సందడి!

Published on Mon, 01/26/2026 - 10:44

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘భారత్ పర్వ్’ ఉత్సవాలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. జనవరి 26 నుండి 31 వరకు ఆరు రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ సాంస్కృతిక, పర్యాటక మహోత్సవాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, రుచులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ఉత్సవ ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేలా ఈ ఉత్సవం రూపుదిద్దుకుంది. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా 41 శకటాల ప్రదర్శన నిలవనుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో సందర్శకులను అలరించనున్నారు.

ఈ ఉత్సవంలో దేశవ్యాప్తంగా వివిధ ప​్రాంతాలకు చెందిన  విభిన్న రుచులను అందించే 60 స్టాల్స్‌తో కూడిన భారీ ఫుడ్ కోర్ట్, లైవ్ కుకింగ్ డెమోలు ఆహార ప్రియులను ఆకట్టుకోనున్నాయి. ఈ ఆరు రోజుల పండుగలో అందరూ పాల్గొనేందుకు ఉచిత ‍ప​్రవేశాన్ని కల్పించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 25కి పైగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రముఖ సంస్థలు ఈ వేడుకలో భాగస్వామ్యం కానున్నాయి. ఈ వేడుకకు ప్రజలు భారీగా తరలివస్తారని అధికారులు ఆశిస్తున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)