Breaking News

ప్రయాణికుల్లేని రైల్వే స్టేషన్‌

Published on Sat, 07/11/2026 - 07:35

సాక్షి, స్పెషల్‌ డెస్‌్క: దేశ సరిహద్దులో ఉన్న సింఘాబాద్‌ రైల్వే స్టేషన్‌ మనదేశంలో చివరి రైల్వేస్టేషన్‌గా పేరు తెచ్చుకుంది. ఇది వెస్ట్‌బెంగాల్, మాల్టా జిల్లా, హబీబ్‌పూర్‌కు సమీపంలో ఉంది. ఒకప్పుడు కోల్‌కతా–ఢాకాల మధ్య వచ్చే పోయే రైళ్లతో, ప్రయాణికులతో కళకళలాడిన ఈ స్టేషన్‌ ఇప్పుడు ఒక చారిత్రక జ్ఞాపకంగా మారింది.  

ఉద్యోగులున్నారు.. కౌంటర్‌ తెరవరు! : బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన సింఘాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఇప్పటికీ అదే కళతో ఉంది. 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడం, దేశవిభజన ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. ఈస్ట్‌ బెంగాల్‌ భౌగోళికంగా మనదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్‌లో భాగమైంది. ప్రయాణికుల రైళ్ల రాకపోకలు అప్పుడు ఆగిపోయాయి. నేపాల్‌తో 2011లో కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దుల గుండా సరుకు రవాణా చేసే గూడ్స్‌ రైళ్లు ప్రయాణిస్తాయి. అందుకే స్టేషన్‌ ఉంది, ఉద్యోగులున్నారు. టికెట్‌ కౌంటర్‌ తెరిచే పని లేదన్నమాట. 

బ్రిటిష్‌ ఆర్కిటెక్చర్‌ కోసం: ఈ స్టేషన్‌ ‘దేశంలో చివరి రైల్వేస్టేషన్‌’అనే బోర్డు పెట్టి మరీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. బ్రిటిష్‌ కాలపు నిర్మాణాన్ని చూడాలనే ఆసక్తితో ఆర్కిటెక్చర్‌ విద్యార్థులు వస్తుంటారు. చివరి రైల్వేస్టేషన్‌లో టీ తాగుదామనే సరదాతో పర్యాటకులు వస్తారు. ఉత్తరాఖండ్‌లో టిబెట్‌ సరిహద్దులో ఉన్న మాణాను చివరి గ్రామంగా పర్యాటకశాఖ ప్రచారం కల్పించింది. బెంగాల్‌ ఆ స్థాయిలో ప్రచారం చేయలేదు, కానీ సింఘాబాద్‌ స్టేషన్‌కు ప్రాధాన్యం మాత్రం పెరిగింది. నిర్మాణంలోనే కాదు సాంకేతికత కూడా బ్రిటిష్‌ కాలానిదే. 19వ శతాబ్దం నుంచి నేటికీ పని చేయడం విశేషం. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)