Breaking News

‘ప్రమాద సొరంగం’ వెలుపల ఆలయ నిర్మాణం

Published on Mon, 05/27/2024 - 11:30

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ వెలుపల బాబా బౌఖ్‌నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని నవయుగ కంపెనీ ప్రారంభించింది. నాడు సిల్క్యారా సొరంగంలో కార్మికులు చిక్కుకున్న నేపధ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందం బౌఖ్‌నాగ్ దేవతను వేడుకున్నారట.

గత ఏడాది నవంబర్‌లో సిల్క్యారా టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వీరిని రక్షించడానికి సుమారు మూడు వారాల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. జిల్లా యంత్రాంగంతోపాటు పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, విదేశీ సంస్థల నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

దీని తరువాత కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.  మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాడు బౌఖ్‌నాగ్ దేవత పూజారి సొరంగం వెలుపల ఆలయాన్ని నిర్మించాలని రెస్క్యూ టీమ్‌ని కోరాడు. ఈ నేపధ్యంలో తాజాగా నవయుగ కంపెనీ బౌఖ్‌నాగ్‌ దేవత ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని కంపెనీ పీఆర్వో జీఎల్ నాథ్ తెలిపారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాదితోపాటు పిల్లర్ పనులు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ నిర్ణయించింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)