Breaking News

సిక్కిం సొరంగ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి

Published on Tue, 07/21/2026 - 11:46

నామ్చి: సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌పిసి తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం కూలిన దుర్ఘటనలో కేరళలోని కోట్టాయం జిల్లాకు చెందిన జియాలజిస్ట్ అనీష్ మోహన్ గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సమర్దుంగ్ ప్రాంతంలోని సొరంగంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. సొరంగంలో చిక్కుకున్న వారిని, గల్లంతైన అనీష్ మోహన్‌ను వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
 

సహాయక చర్యలను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్), సిక్కిం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌హెచ్‌పిసి అధికారులు సంయుక్తంగా ముమ్మరం చేశారు. సవాళ్లతో కూడిన వాతావరణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల కుటుంబాలకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తమాంగ్ సానుభూతి తెలిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)