Breaking News

ఎమ్మెల్యేగా సీఎం సతీమణి ప్రమాణం.. 24 గంటల్లోనే రాజీనామా ఎందుకంటే?

Published on Fri, 06/14/2024 - 13:30

గ్యాంగ్‌టక్‌: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సిక్కిం సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ సతీమణి కృష్ణ కుమారి రాయ్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ తరఫున నామ్చి-సింగితాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణ కుమారి రాయ్‌ విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణ ‍స్వీకారం చేశారు. అయితే, అనూహ్యంగా ఆమె మరుసటి రోజే(గురువారం) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక, కృష్ణ కుమారి రాజీనామాను సిక్కిం స్పీకర్‌ ఎంఎన్‌ షేర్పా ఆమోదించినట్టు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ తెలిపారు.

అయితే, కృష్ణ కుమారి రాయ్‌ రాజీనామాపై సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నా జీవిత భాగస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించింది. ఎస్‌కేఎం పార్టీ పార్లమెంటరీ కమిటీ అభ్యర్థన మేరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఆమె తన పదవి నుంచి వైదొలగినట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె మాకు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

 

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)