అహ్మాదాబాద్‌ ప్రమాద ఘటన దర్యాప్తులో పురోగతి

Published on Fri, 06/12/2026 - 19:23

సాక్షి,అహ్మదాబాద్: గతేడాది సరిగ్గా ఇదే రోజు భారత దేశ విమాన చరిత్రలోనే అత్యంత తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. టేకాఫ్‌ అయిన 32 సెకన్లకే అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మందితో పాటు, మరో 19 మంది దుర్మరణం పాలయ్యారు. సరిగ్గా ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక విషయాలను దర్యాప్తు సంస్థ ప్రకటించింది.

అహ్మదాబాద్‌‌ ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రమాద దర్యాప్తులో తాము గణనీయమైన పురోగతి సాధించామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) (శుక్రవారం) ప్రకటించింది.  దర్యాప్తుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది.

ఆ సంస్ధ విడుదల చేసిన వివరాలు. "గత ఏడాది కాలంగా, దర్యాప్తు బృందం ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని సాంకేతిక, కార్యాచరణ సంస్థాగత మానవ తప్పిదాలకు సంబంధించిన కోణాలను అత్యంత నిశితంగా, కఠినంగా పరిశీలించింది. ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన ప్రతినిధులు, సాంకేతిక సలహాదారులు, సంబంధిత సంస్థలకు చెందిన నిపుణుల సహాయం తీసుకున్నాం. విమాన వ్యవస్థలు, ఫ్లైట్ రికార్డర్ డేటా (బ్లాక్ బాక్స్), ఇంజిన్‌కు సంబంధించిన విడిభాగాలు, నిర్వహణ, కార్యాచరణ రికార్డులతో పాటు ఈ విచారణకు అవసరమైన ఇతర కీలక ఆధారాలను విశ్లేషించడంలో సమాచార సేకరణ పరంగా గణనీయమైన పురోగతి లభించింది." అని ప్రకటన విడుదల చేసింది.

ఆ రోజు ఏం జరిగింది?

2025 జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్), టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లకే కుప్పకూలింది. అయితే, విమానంలో ఉన్న ప్రయాణికులలో ఒకరు మాత్రం ఈ ప్రమాదం నుండి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు.

AAIB, గతేడాది జూలైలో తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు "RUN" పొజిషన్ నుండి "CUTOFF" పొజిషన్‌కు మారిపోయాయని, దీనివల్ల ఇంజిన్‌లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఆ స్విచ్‌లు అలా మారడానికి గల అసలు కారణం ఏమిటనేది మాత్రం ఆ నివేదికలో స్పష్టం చేయలేదు. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి ఇది వరకూ ఎవరినీ బాధ్యులుగా ప్రకటించలేదు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)