Breaking News

సిద్ధిఖీ హ‌త్య‌ కేసులో కొత్త కోణం.. హంతకుల ద‌గ్గ‌ర పెప్పర్‌ స్ప్రే!

Published on Mon, 10/14/2024 - 13:15

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పరారైన మూడవ నిందితుని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాల్పులకు ముందు నిందితులు పెప్పర్‌ స్ప్రే వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ కేసులో పట్టుబడిన నిందితులిద్దరినీ అక్టోబర్ 24 వరకు పోలీసు కస్టడీకి పంపారు.

ముంబై క్రైమ్ బ్రాంచ్ నిందితులిద్దరి నుంచి రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకుంది. నిందితులు తమ వెంట పెప్పర్ స్ప్రే కూడా తీసుకొచ్చారు. ఒక నిందితుడు గాలిలోకి పెప్పర్‌ స్ప్రే వెదజల్లి కాల్పులు జరపబోతుండగా, మూడో నిందితుడు(పరారీలో ఉన్న) శివకుమార్ నేరుగా కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో బాబా సిద్ధిఖీ వెంట ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. ఆకస్మిక దాడిలో వారు ఏమీ చేయలేకపోయారు.

ఈ కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ తరపున హత్యకు బాధ్యత వహించినట్లు ప్రకటించిన షుబు లోంకర్ సోదరుడు ప్రవీణ్‌ లోంకర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షుబు లోంకర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులకు ప్రవీణ్ లోంకర్ ఆశ్రయం కల్పించాడు. బాబా సిద్ధిఖీతో పాటు అతని కుమారుడు జీషన్ సిద్ధిఖీని కూడా చంపాలని ఆదేశాలు అందాయని పోలీసులకు పట్టుబడిన నిందితులు విచారణలో తెలిపారు. డీసీపీ క్రైమ్ బ్రాంచ్ దత్తా నలవాడే  తెలిపిన వివరాల ప్రకారం అరెస్టయిన నిందితులిద్దరి నుంచి 28 లైవ్ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య?

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)