Breaking News

సియాచిన్‌ డే: అత్యంత ఎత్తయిన యుద్ధభూమిలో భారత్‌ విజయం

Published on Sun, 04/13/2025 - 10:14

న్యూఢిల్లీ: ఈరోజు (ఏప్రిల్‌ 13) అమరవీరులకు భారత సైన్యం ఘన నివాళులు ఆర్పిస్తూ ‘సియాచిన్‌ డేను నిర్వహిస్తోంది. 1984లో సియాచిన్ మంచునదిపై సాధించిన విజయాన్ని భారత్‌ స్మరించుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన (5,400 మీటర్ల పైన) యుద్ధభూమిలో జరిగిన పోరాటంలో భాగస్వామ్యం వహించిన వీరులను భారత సైన్యం సమున్నతంగా గౌరవిస్తోంది.  

సియాచిన్ గ్లేసియర్ (మంచునది) జమ్ముకశ్మీర్‌లో భారత్-పాక్ సరిహద్దులో ఉంది. 1984లో ఆపరేషన్ మేఘదూత పేరుతో  భారత సైన్యం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. నాడు -50°C ఉష్ణోగ్రత, ఆక్సిజన్ కొరత వంటి కఠినమైన వాతావరణంలో భారత సైనికులు పోరాటం సాగించారు. సియాచెన్ డే సందర్భంగా భారతసైన్యం వీర స్మారక కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. సియాచిన్‌ యుద్ధంలో మరణించిన సైనికులకు ఘనంగా నివాళులు అర్పిస్తుంది.

సియాచిన్‌ డే నాడు వివిధ సైనిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. అత్యాధునిక శస్త్రాస్త్రాలు, హిమప్రదేశాల్లో యుద్ధ వ్యూహాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. పలు కార్యక్రమాల్లో కమాండర్లు ప్రసంగిస్తారు. ‍పస్తుతం సియాచిన్‌పై భారత్‌ పూర్తి నియంత్రణ కలిగి ఉంది. ఇక్కడి పనిచేసే సైనికులు ప్రత్యేక శిక్షణ పొందుతారు. అతిశీతల పరిస్థితుల్లో పోరాడేందుకు నిత్యం సిద్ధంగా ఉంటారు. సియాచిన్ డే  అనేది భారత సైన్యం చూపిన ధైర్యం, త్యాగాలకు నిదర్శనంగా నిలుస్తుంది. 

ఇది కూడా చదవండి: ఆలయంలో దౌర్జన్యం.. గేటు తీయలేదని పూజరిపై దాడి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)