Breaking News

UPSC Success Story: ఇటు ఉద్యోగం.. అటు చదువు.. శ్వేతా భారతి విజయగాథ

Published on Sun, 01/12/2025 - 10:08

పట్టుదల ఉంటే సాధించలేదని ఏదీ లేదని అంటారు.  దీనిని కొందరు నిజమని నిరూపించారు. ఈ కోవలోకే వస్తారు శ్వేతా భారతి. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమైన శ్వేత తాను అనుకున్నది సాధించి, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష(UPSC Civil Service Exam) ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఒకటని చెబుతుంటారు. పలువురు అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు కోచింగ్ తీసుకుంటారు. అయితే ఏమాత్రం కోచింగ్ అవసరం లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు కూడా ఉన్నారు. ఇటీవలే బీహార్ కేడర్‌లో పోస్టింగ్‌ అందుకున్న ఐఏఎస్ శ్వేతా భారతి దీనికి ఉదాహరణగా నిలిచారు.

బీహార్ యువతి శ్వేతా భారతి(Shweta Bharti) యూపీఎస్సీ పరీక్షకు ముందు బీపీఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. అయితే ఐఏఎస్ అధికారి కావడమే ఆమె కల. అందుకే ఆమె ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకున్నప్పటికీ, యూపీఎస్సీకి ప్రపరేషన్‌ కొనసాగించారు. శ్వేతా భారతి ఉదయం పూట 9 గంటల పాటు పనిచేస్తూనే, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.

శ్వేతా భారతి బీహార్‌లోని నలంద జిల్లాలో జన్మించారు. ఆమెది సాధారణ కుటుంబ నేపధ్యం. శ్వేతా భారతి చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేవారు. పట్నాలోని ఇషాన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ఆమె భాగల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఎలక్ట్రికల్,టెలికమ్యూనికేషన్‌లో బీటెక్ డిగ్రీని అందుకున్నారు. తరువాత ఆమె విప్రోలో ఉద్యోగం సంపాదించారు.

లక్షల్లో జీతం అందుకుంటున్నప్పటికీ ఆమె ఐఏఎస్ అధికారి(IAS officer) కావాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతూ వచ్చారు.  పగటిపూట ఉద్యోగం చేస్తూనే, రాత్రపూట చదువుకోసాగారు. 2020లో జరిగిన బీపీఎస్‌సీ పరీక్షలో శ్వేతా భారతి 65 వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమెకు ప్రోగ్రామ్ ఆఫీసర్ (డీపీఓ)గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ ఆమె తన లక్ష్యం నెరవేర్చుకునే దిశగానే ముందుకు సాగారు. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించింది. 2021లో యూపీఎస్సీ పరీక్షలో 356వ ర్యాంక్‌ సాధించారు. శ్వేతా భారతి యూపీఎస్సీ2021 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్‌ మహిళా అధికారి. ప్రస్తుతం బీహార్‌లోని భాగల్పూర్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ISRO SpaDeX Mission: స్పేడెక్స్‌ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం: ఇస్రో 

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)