Breaking News

శుభాంశు శుక్లాకు అశోక చక్ర 

Published on Mon, 01/26/2026 - 05:52

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వాయుసేన గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లాకు ప్రభుత్వం అత్యున్నత సాహస పురస్కారం అశోక చక్రను ప్రకటించింది. ఎస్‌యూ–30 ఎంకేఐ, మిగ్‌–21, మిగ్‌– 29, జాగ్వార్, హాక్, డార్నియర్, ఏఎన్‌–32 వంటి యుద్ధ విమానాలను నడిపిన శుక్లాకు 2 వేల గంటల ఫ్లయిట్‌ అనుభవముంది. 

శుక్లా గతేడాది జూన్‌లో యాగ్జియం–4 మిషన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లి 18 రోజులు గడపడం తెలిసిందే. తొలిసారిగా 1984లో రష్యా సూయుజ్‌ మిషన్‌లో రాకేశ్‌ శర్మ రూపంలో భారత వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లగా..41 ఏళ్ల తర్వాత శుభాంశు ఆ ఘనత సాధించి రికార్డు నెలకొల్పారు. తాజాగా, రాష్ట్రపతి ముర్ము ప్రకటించిన 70 మంది సాహస అవార్డు గ్రహీతల్లో ఆయన కూడా ఉన్నారు. వీరి ఆరుగురికి మరణానంతరం పురస్కారం ప్రకటించారు. మేజర్‌ అర్షదీప్‌సింగ్, గ్రూప్‌ కెపె్టన్‌ బాలకృష్ణన్‌ నాయర్, నాయబ్‌ సుబేదార్‌ డోలేశ్వర్‌ సుబ్బాకు కీర్తిచక్ర ప్రకటించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)