Breaking News

గో హంతకునిపై పోలీసుల కాల్పులు

Published on Mon, 09/30/2024 - 09:50

ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసులు వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా పోలీసులు ఉన్నావ్‌లో గో హంతకునిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గోవులను వధించి, వాటి అవశేషాలను బహిరంగంగా పారవేసిన కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిని గమనించిన నిందితుని సహచరుడు అ‍క్కడి నుంచి పరారయ్యాడు. కాల్పులలో గాయపడిన వ్యక్తిని మహతాబ్ ఆలం ఖురేషీగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

అన్వర్ నగర్,  కృష్ణ నగర్‌లలో గోవులను వధించారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోహత్యపై విచారణ చేపట్టి, వారికి లభ్యమైన ఆవుల అవశేషాలను పాతిపెట్టారు. అయితే దీనిపై కలకలం చెలరేగడంతో  పోలీసు అధికారి సోనమ్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు  గోహత్య ఘటనలో ప్రమేయమున్న నిందితులపై కాల్పులు జరిపారు. 

ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)