Breaking News

భార్యను కాపురానికి పంపలేదని అత్తకు శ్రద్ధాంజలి పోస్టర్‌

Published on Wed, 04/02/2025 - 09:54

వేలూరు: తిరుపత్తూరు సమీపంలోని తన భార్యను కాపురానికి పంపలేదని అత్తపై ఆగ్రహించిన అల్లుడు అత్త మృతి చెందినట్లుగా శ్రద్ధాంజలి పోస్టర్‌ను ముద్రించి వాటిని అన్ని ప్రాంతాల్లో కరిపించడంతో పాటూ బంధువులకు వాట్సాప్‌ ద్వారా పంపిన ఘటన సంచలనం రేపింది. 

తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని నిమ్మయంబట్టు గ్రామానికి చెందిన వెంకటేశన్‌ ఇతని భార్య వినోదిని దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. వెంకటేశన్‌ బ్యాంకులో లోన్‌ తీసుకొని పాడి పశువును కొనుగోలు చేసి బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించలేదు. దీంతో దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భార్య వినోదిని  ఇలక్కినాయకన్‌పట్టి గ్రామంలో ఉన్న అమ్మగారింటికి రెండు నెలల క్రితం వెళ్లింది. 

అక్కడ నుంచే వినోదిని వేరే దుకాణంలో పనిచేస్తోంది. ఇదిలా ఉండగా అత్త మాదు తన భార్యను కాపురానికి పంపకుండా అడ్డుకుంటుందని ఆగ్రహించిన వెంకటేశన్‌ అత్త ప్రాణాలతో ఉన్నప్పటికీ ఆమె మృతి చెందినట్లు శ్రద్ధాంజలి బ్యానర్, పోస్టర్‌లు వేసుకొని చుట్టు పక్కల కరిపించడంతో పాటూ భార్య వినోదిని బంధువులకు వాట్సాప్‌ పంపాడు. ఈ విషయాన్ని బంధువులు వినోదినికి పోన్‌ చేసి విషయాన్ని తెలిపారు. దీంతో వినోదిని తన భర్త వెంకటేష్‌ నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకటేష్‌ ను అరెస్ట్‌ చేశారు.  

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)