Breaking News

మరీ ఇలా ఉన్నావేంట్రా.. పనిమనిషిపై అత్యాచారం!

Published on Sat, 09/20/2025 - 12:22

కర్ణాటక: మొబైల్ ఫోన్, అందులో లభ్యమయ్యే చెత్త కంటెంట్ బాలలను పెడదోవ పట్టిస్తోంది. అలాంటిదే ఈ సంఘటన. మైనర్ బాలుడు ఒకరు తమ ఇంటిలో పనిచేసే మహిళపై లైంగికదాడికి పాల్పడి అత్యంత పాశవికంగా హత మార్చాడు. ఈ దారుణ ఘ‌ట‌న హాసన్ జిల్లాలో అరసికెరె తాలూకా జవగళ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందూరు గ్రామంలో జరిగింది.

నిర్మానుష్య ప్రదేశంలో..
గ్రామస్తులు, పోలీసులు తెలిపిన మేరకు.. మహిళ (43) ఓ రైతు ఇంట్లో పనిచేస్తోంది. అదే ఇంట్లో రైతు బంధువైన 17 ఏళ్లు బాలుడు ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు గతంలో చనిపోగా రైతు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గత సోమవారం ఉదయం ఆమెతో బియ్యం కొనాలని దూరంగా ఉండే అంగడికి నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో బాలుడు కూడా ఆమె వెంట వెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో అతడు ఆమెను ఓ పొలంలోకి లాక్కువెళ్లి అత్యాచారం చేశాడు. ఆ విషయం అందరికీ చెబుతుంద‌నే భ‌యంతో బండరాయితో తలపై కొట్టి, ఆపై చెట్టు కొమ్మతో చితకబాది చంపేసి, ఆమె మొబైల్ ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. 

మరుసటి రోజు వరకు తల్లి కనబడకపోవడంతో ఆమె కొడుకు దినేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలించగా పొలంలో మృతదేహం కనిపించింది. మైనర్ కావడంతో మొదట బాలునిపై ఎలాంటి అనుమానం రాలేదు. దినేశ్ ఫిర్యాదుతో అతనిని తమదైనశైలిలో విచారణ చేయగా తప్పు ఒప్పుకున్నాడు. హంతకున్ని అరెస్ట్ చేశారు. హత్యపై లోతుగా విచారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహమ్మద్ సుజీత తెలిపారు. ఈ సంఘటన గ్రామంలో భయాందోళన కలిగిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)