Breaking News

మగబిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక

Published on Mon, 09/01/2025 - 09:55

కర్ణాటక: ప్రాథమిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చి  మగబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. బాలిక, శిశువు ఆరోగ్యంగా ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వివరాలు.. బాలిక (15) 9వ తరగతి చదువుతోంది. కడుపు నొప్పిగా ఉందంటూ రెండు రోజుల నుంచి బడికి వెళ్లడం లేదు. శుక్రవారంనాడు ఇంటిలోనే ప్రసవించగా, మగపిల్లాడు పుట్టాడు. కుటుంబ సభ్యులు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచారు. 

7వ నెలలోనే కాన్పయినట్లు తెలిసింది. ఆనోటా ఈనోటా ప్రచారం సాగింది. శిశు సంక్షేమ అధికారులు, పోలీసులు బాలిక ఇంటికి వెళ్లి విచారించారు, బాలిక తల్లిదండ్రులు కూలి పనులు చేస్తారని, వారికి మొత్తం ముగ్గురు పిల్లలని సమాచారం. కాగా, తల్లీ కొడుకును ఆస్పత్రిలో చేరి్పంచారు. బాలిక పైన లైంగిక దాడి చేసిన వారికోసం విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మిథున్‌ తెలిపారు. బాలికను కూడా విచారించగా పరస్పర విరుద్ధ సమాచారం చెబుతోందని తెలిసింది. బాలిక కోలుకున్నాక  పూర్తి విచారణ సాగిస్తామని పోలీసులు చెప్పారు.    

 

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)