Breaking News

ఫడ్నవీస్‌పై ఇ‍జ్రాయెల్‌ దాడికి ప్లాన్‌ చేస్తోందా?.. సంజయ్‌ రౌత్‌ సెటైర్లు

Published on Sun, 11/03/2024 - 19:59

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే శివసేనకు చెందిన రెండు వర్గాల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు.. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నీవీస్‌కు భద్రత పెంచడంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ఫడ్నవీస్‌ మీద ఇప్పుడేమైనా ఇజ్రాయెల్‌ లేదా లెబనాన్‌ దాడికి దిగుతున్నాయా? అని ప్రశ్నించారు.

మహారాష్ట్రలో ఎన్నికల వేళ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు అదనపు భద్రత పెంచుతున్నారనే సమాచారం వచ్చింది. ఫడ్నవీస్‌కు ప్రస్తుతం జెడ్‌ ప్లస్‌ భద్రత ఉండగా.. ఆయన కోసం అదనపు ఫోర్స్‌ వన్‌ కమాండోలను నాగపూర్‌లో ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్‌ భద్రతపై శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు.

ఈ సందర్బంగా రౌత్‌ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు ఆకస్మికంగా భద్రతను పెంచడానికి కారణం ఏంటి?. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆయన.. తన కోసం భద్రతను పెంచుకోవడం ఏంటి?. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏం రక్షణ ఇస్తారు?. ఫడ్నవీస్‌‌ నివాసం వెలుపల ఫోర్స్‌ కమాండోలు నిలబడి ఉన్నారు. నాగపూర్‌ మరో 200 మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం ఎందుకు అంత భయపడుతున్నారు. ఆయనపై దాడి జరగబోతోందా..? అలా ఎవరు చేయాలనుకుంటున్నారు..? ఇజ్రాయెల్‌ లేదా లెబనాన్‌ ఏమైనా ఆయనపై దాడికి దిగుతున్నాయా..? అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో భద్రతను పెంచడంపై ఫడ్నవీస్‌, డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో నవంబర్‌ 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఉద్దవ్‌థ్రాకే శివసేన వర్గం పట్టుదలతో ప్రచారంలో బిజీ ఉంది. 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)