Breaking News

Shiv Sena: శివసేన ఎమ్మెల్యే అనిల్‌ మృతి.. సీఎం షిండే దిగ్భ్రాంతి

Published on Wed, 01/31/2024 - 10:27

ముంబై: మహారాష్ట్రలో సీనియర్‌ రాజకీయనాయకుడు, శివసేన ఎమ్మెల్యే అనిల్‌ బాబర్‌(74) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఇక, ఆయన మృతిపట్ల సీఎం ఏక్‌నాథ్‌ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

కాగా, గత కొద్దిరోజులు అనిల్‌ బాబర్‌ అనారోగ్యం కారణంగా సంగ్లీ జిల్లాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం కన్నుమూశారు. ఇక, అనిల్‌ మృతిపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షిండే.. బాబర్ మృతితో ఒక మార్గదర్శిని, సన్నిహితుడిని కోల్పోయినట్టు కామెంట్స్‌ చేశారు. మహారాష్ట్ర ఒక సీనియర్ ప్రజాప్రతినిధిని కోల్పోయిందన్నారు. అలాగే, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని షిండే తెలిపారు.

మరోవైపు.. అనిల్‌ బాబర్‌ అకాల మరణం నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన మహారాష్ట్ర కేబినెట్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. అనిల్‌ మృతి పట్ల సంతాపం తెలియజేసేందుకు ఆయన కుటుంబ సభ్యులను సీఎం షిండే పరామర్శించనున్నారు. ఈ క్రమంలో సంగ్లీలోని అనిల్‌ నివాసానికి షిండే వెళ్లనున్నారు. ఇక, అనిల్‌ బాబర్‌ ప్రస్తుతం సంగ్లీ నియోజకవర్గం నుంచి శివసేన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)