Breaking News

డాక్టరా?.. దండపాణా? 

Published on Tue, 12/23/2025 - 06:24

సిమ్లా: ప్రాణం పోయాల్సిన చోట.. ప్రాణభ యం నీడలా వెంటాడింది. రోగికి అండగా ఉండాల్సిన వైద్యుడే.. యమధర్మరాజులా విరుచుకుపడ్డాడు. సిమ్లా (హిమాచల్‌ ప్రదేశ్‌)లోని అ త్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ వైద్య కళాశాల (ఐజీఎంసీ) ఆసుపత్రి ఒక అమాన వీయ ఘటనకు వేదికైంది. ఊపిరి అందక విలవిల్లాడుతున్న రోగికి వైద్యం అందించాల్సింది పోయి, రౌడీలా మారి ముష్టిఘాతా లు కురిపించాడొక వైద్యుడు. ప్రస్తుతం సోష ల్‌ మీడియాను కుదిపేస్తున్న ఆ వీడియోను చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది! 

అసలేం జరిగిందంటే.. 
అర్జున్‌ పవార్‌ అనే వ్యక్తి ఎండోస్కోపీ పరీక్ష కోసం ఐజీఎంసీకి వచ్చాడు. పరీక్ష పూర్తయ్యాక అతనికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆయాసంతో ఊపిరాడక, కాస్త ఉపశమనం కోసం పక్కనున్న వార్డులోని ఒక ఖాళీ బెడ్‌పై పడుకున్నాడు. అదే అతను చేసిన ’నేరం’. విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యుడు అక్కడికి వచ్చి, ’నా బెడ్‌ మీద ఎందుకు పడుకున్నావు?’ అంటూ రోగితో వాగ్వాదానికి దిగాడు. 

వైద్యానికి బదులు.. దెబ్బల వర్షం 
రోగి పరిస్థితిని అర్థం చేసుకోవలసింది పోయి, ఆ వైద్యుడు దురుసుగా వ్యవహరించాడు. మాటామాటా పెరగడంతో సహనం కోల్పోయిన సదరు వైద్యుడు, రోగిపై భౌతిక దాడికి దిగాడు. అస్వస్థుడైన ఆ రోగిని కనికరం లేకుండా కొట్టడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. ఈ దృశ్యాలన్నీ ఎవరో వీడియో తీయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  

కట్టలు తెంచుకున్న ఆగ్రహం 
ఈ దాడి వార్త తెలియగానే బాధితుడి బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. సదరు వైద్యుడిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితుని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం మరింత తీవ్రరూపం దాలి్చంది. 

విచారణకు సీఎం ఆదేశం 
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సంఘటనను.. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖి్వందర్‌ సింగ్‌ సుఖు తీవ్రంగా పరిగణించారు. వెంటనే నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అటు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాహుల్‌ రావు స్పందిస్తూ.. దీనిపై అంతర్గత విచారణ కమిటీని వేశామని, తప్పు తేలితే కఠిన చర్యలు తప్పవని హామీ ఇచ్చారు. ఆ విచారణ నివేదికలో ఏం తేలుతుందో.. ఆ ’ముతక’ వైద్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)