Breaking News

పుతిన్ పర్యటనపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

Published on Wed, 12/03/2025 - 17:43

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు భారత్ రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్- రష్యా 23వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ  ఎంపీ శశి థరూర్ భారత్ - రష్యా మధ్య మైత్రి ఎంతో ముఖ్యమైనదంటూ  కీలక వ్యాఖ్యలు చేశారు.

రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్యా సోవియట్ యూనియన్ గా ఉన్న సమయం నుంచే రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఆకాలం నుంచే రెండు దేశాలు పరస్పర సహకారాలు అందించుకుంటూ వస్తున్నాయి. కాగా రేపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్  ఈ పర్యటనపై మాట్లాడారు.

"రష్యా అధ్యక్షుడి పర్యటన చాలా ముఖ్యమైనది. ఈ స్నేహం చాలా పాతది, బలమైనది, అదే విధంగా అమెరికా, చైనాలతోనూ ద్వైపాక్షిక బంధాల్ని కొనసాగించాలి. భారత ఆర్థిక వ్యవస్థను వేరే ఏ దేశం కోసం తనఖా పెట్టకూడదు" అని శశి థరూర్ అన్నారు. ఈ మూడు దేశాలతో భారత్ వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కొనసాగించాలని తెలిపారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఈయూతో పాటు అమెరికా పలు ఆంక్షలు విధించి ఏకాకిని చేసే యత్నం చేశాయి. భారత్ సైతం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.  అయితే వీటిని భారత్ లెక్కచేయకుండా మాస్కోతో మైత్రిని కొనసాగించింది. తన చిరకాల మిత్రునికి అండగా నిలిచింది.  

రష్యా నుంచి  భారత్ రక్షణ రంగ సామాగ్రి , పెట్రోలియం, ఎరువులు పెద్దఎత్తున  దిగుమతి చేసుకుంటుంది. అదేవిధంగా జౌషదాలు, ఇతర రసాయనాలు, యంత్రాలు మాస్కోకు ఎగుమతి చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చివరిసారిగా 2021లో ఇండియాలో పర్యటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి.

#

Tags : 1

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)