ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం

Published on Thu, 07/10/2025 - 11:11

సాక్షి, న్యూఢిల్లీ: అవకాశం వచ్చినప్పుడల్లా తన సొంత పార్టీపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ మరోసారి తన మాటలకు పదును పెట్టారు. 1975లో కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)పై విమర్శలు గుప్పించారు. అప్పట్లో క్రమశిక్షణ, శాంతి పేరుతో ఎన్నో దారుణాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

గురువారం మలయాళ పత్రిక ‘దీపిక’లో రాసిన వ్యాసంలో కాంగ్రెస్‌ పార్టీపై శశి థరూర్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో క్రమశిక్షణ పేరిట చేపట్టిన చర్యలు ఎన్నో దారుణాలకు దారితీశాయని, అవి క్షమించరాని తప్పులని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం అని తేల్చిచెప్పారు. ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్‌ గాంధీ చేపట్టిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమం అత్యవసర పరిస్థితి కాలంలో జరిగిన దారుణాలకు పెద్ద ఉదాహరణగా నిలిచిందని స్పష్టంచేశారు. 

గ్రామాల్లో నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడం కోసం హింస, బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. ఢిల్లీ వంటి నగరాల్లో పేదల గుడిసెలను నేలమట్టం చేసి వేలాది మంది ప్రజలను నిరాశ్రయులుగా మార్చారని ఆక్షేపించారు. ఇళ్లు కోల్పోయిన పేదల పునరావాసం, సంక్షేమం గురించి అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆసక్తి చూపలేదని వెల్లడించారు. అప్పటి దురాగతాలకు ప్రధాని ఇందిరా గాంధీ మద్దతు పలికారని ఆరోపించారు. ప్రత్యర్థులను జైల్లో పెట్టడం, ప్రజల ప్రాథమిక హక్కులను హరించడం, పత్రికలపై ఆంక్షలు విధించడం, చట్టాలను ఉల్లంఘించడం వంటివి మన రాజకీయాల్లో ఒక మచ్చగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమర్జెన్సీని దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తుచేశారు. 

ప్రజాస్వామ్య పరిరక్షకులు అప్రమత్తంగా ఉండాలి 
ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ తక్కువ చేసి చూడరాదని, ఇది మనకు దక్కిన విలువైన సంపద అని శశి థరూర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మనదేశం 1975లోని భారత్‌ కాదన్న విషయం గుర్తుంచుకోవాలని... మనం ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నామని, మరింత అభివృద్ధి సాధించామని, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్నామని వివరించారు.

 ప్రజాస్వామ్య వ్యవస్థే మన బలమని ఉద్ఘాటించారు. అత్యవసర పరిస్థితి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఉన్నాయని వివరించారు. అధికారాన్ని ఒకచోటే కేంద్రీకరించడం, విరుద్ధ స్వరాలను అణచివేయడం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడం వంటి దుష్పరిణామాలు మళ్లీ వేరే రూపాల్లో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయన్నారు. దేశ ప్రయోజనాలు, సుస్థిరత అనే సాకులతో అలాంటి వాటిని సమర్థించడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. 

కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. అత్యవసర పరిస్థితి మనకు ఎప్పటికీ ఒక పెద్ద హెచ్చరిక అని శశి థరూర్‌ తేల్చిచెప్పారు. మరోవైపు ఎమర్జెన్సీ పట్ల శశి థరూర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వి.డి.సతీశన్, కె.మురళీధరన్‌ స్పందించారు. ఎప్పుడో విధించిన ఎమర్జెన్సీపై ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. శశి థరూర్‌ వ్యవహార శైలిపై తమ పార్టీ నాయకత్వం తగిన సమయంలో స్పందిస్తుందని పేర్కొన్నారు.    

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)