Breaking News

వారి నుంచి ప్రేమ లేఖ అందింది: శరద్‌ పవార్‌

Published on Fri, 07/01/2022 - 10:29

ముంబై: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు ఆదాయపు పన్నుశాఖ షాకిచ్చింది. మహారాష్ట్రాలో తీవ్ర ఉత్కంఠ రేపిన రాజకీయ సక్షోభం ఒక్కరోజులోనే అనుహ్యమైన మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పలు నాటకీయ పరిణామాల నడుమ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్‌ నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి 24 గంటలు గడవకు మునుపే శరద్‌ పవార్‌కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఐతే ఇవి ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల, ఆదాయం పై ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మహారాష్ట్రలో సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవర్‌ మాట్లాడుతూ..."ఆదాయపు పన్ను శాఖ నోటీసుల విషయమై నాకు ప్రేమ లేఖ అందిందన్నారు. ఇది 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లకు సంబంధించి ‘ప్రేమలేఖ’ అని చమత్కరించారు. దీని గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విభాగం గత కొద్ది సంవత్సరాలుగా కొంతమంది వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుతం ఈ విభాగం సమర్థవంతంగా పనిచేయడంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది కూడా. బహుశా తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల నుంచి సమాచారం సేకరించడం పై దృష్టి పెట్టడం ఒక వ్యూత్మాకమైన మార్పు కాబోలు" అని అన్నారు.

అదీగాక మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం, సొంత పార్టీలోనే వ్యక్తులే తిరుబాటు చేయడంతో కలత చెందిన ఉద్దవ్‌ థాక్రే రెండు సార్లు రాజీనామ చేయలనుకున్నారు. ఐతే ఆ సమయంలో థాక్రేకి ధైర్యం చెప్పి వెన్ను చూపి పారిపోవద్దంటూ సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ హితో భోద చేశారంటూ... కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా థాక్రే  ప్రభుత్వం బేజేపీ నేతలపై వేధింపులకు పాల్పడుతోదంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ రియాక్షన్‌ షూరు చేసి...కౌంటర్‌ ఎటాక్‌ మొదలుపెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

(చదవండి: ‘మహా’ సీఎం షిండే .. డిప్యూటీగా ఫడ్నవీస్‌)

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)