Breaking News

‘సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ కర్నాటక’ అకౌంట్‌ క్రియేట్‌ చేశాం 

Published on Sat, 07/19/2025 - 06:35

బెంగళూరు: సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో ‘సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ కర్నాటక’పేరుతో ఫేక్‌ అకౌంట్‌ని ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా క్రియే ట్‌ చేసినట్లు సొలిసిటర్‌ జనరల్‌(ఎస్‌జీ) తుషార్‌ మెహతా చెప్పారు. ఇలా ఇష్టారాజ్యంగా ప్రమాదకరమైన ధోరణులకు ‘ఎక్స్‌’సైతం వేదికగా మారిందని తెలిపారు. సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్‌ కార్పొరేషన్‌తో కేంద్రం విభేదాలు కొనసాగుతున్న వేళ శుక్రవారం కర్నాటక హైకోర్టులో వాదనల సందర్భంగా ఎస్‌జీ తుషార్‌ మెహతా దీనిని ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. 

ప్రజలను సులువుగా మోసం చేసేందుకు సామాజిక మాధ్యమ వేదికలను దుర్వినియోగం చేసేందుకు ఎంతో అవకాశముందని వివరించారు. ‘నేను ఈ అకౌంట్‌ క్రియేట్‌ చేశాను. ఎక్స్‌ ఈ అకౌంట్‌ను ధ్రువీకరించింది కూడా. నేనిక ఇందులో ఏదైనా పోస్ట్‌ చేసుకోవచ్చు. జనం సైతం సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ కర్నాటక ఇలా చెప్పి ఉంటుందనే నమ్ముతారు’అంటూ మెహతా వాదించారు. 

దుర్వినియోగం తీవ్రతను చూపేందుకు తప్ప, కంటెంట్‌ను పోస్ట్‌ చేయడానికి ఈ అకౌంట్‌ను క్రియేట్‌ చేయలేదని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వచ్చే కంటెంట్‌కు జవాబుదారీతనం లేదనటానికి ఇదో ఉదాహరణ అని వాదించారు. ఫలానా సమాచారాన్ని తొలగించాలంటూ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 79(3)(బీ) కింద ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎక్స్‌ కార్పొరేషన్‌ వేసిన పిటిషన్‌పై వాదనల సందర్భంగా కేంద్రం తరఫున తుషార్‌ మెహతా ఈ లోపాన్ని ఎత్తి చూపారు. అయితే, ఇదే చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్రకారం మాత్రమే సంబంధిత కంటెంట్‌ను బ్లాక్‌ చేయాలని ఆదేశించొచ్చని ఎక్స్‌ కార్పొరేషన్‌ వాదించింది.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)