Breaking News

ఢిల్లీలో 13 ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్లు సీజ్‌

Published on Mon, 07/29/2024 - 07:26

ఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లోకి వర్షం నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఈ ఘటన నేపథ్యంలో ఓల్డ్‌ రాజేం‍ద్ర నగర్‌​ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి బేస్‌మెంట్‌ ఏరియాను ఉపయోగిస్తున్న 13 కోచింగ్‌ సెంటర్లపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ(ఎంసీబీ) చర్యలు చేపట్టింది. ఈ మేరకు 13 కోచింగ్‌ సెంటర్లను అధికారులు సీజ్‌ చేశారు.

‘‘ఆదివారం రాజేంద్ర నగర్‌ ప్రాంతంలోని పలు ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్లలో ఎంసీడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బేస్‌మెంట్‌ ఏరియాను కమర్షియల్‌  అవసరాలకు ఉపయోగిస్తున్న కోచింగ్ సెంటర్లను సీజ్‌చేశాం. శనివారం జరిగిన ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు చేపట్టాం. రాజేంద్రనగర్‌ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్‌ సెంటర్లను సీజ్‌ చేస్తాం. అదేవిధంగా ఢిల్లీ మొత్తం ఉన్న కోచింగ్‌ సెంటర్లు,  పలు భవనాల్లో తనిఖీలు చేస్తాం’’ అని  ఢిల్లీ మేయర్‌ షెల్లీ  ఒబేరాయ్‌ ‘ఎక్స్‌ ’లో పేర్కొన్నారు. 

నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రావుస్‌ ఐఎఎస్ స్టడీ సెంటర్‌లో  జరిగిన సంఘటనకు ఎంసీడీ అధికారులు ఎవరైనా బాధ్యులు ఉన్నారా? అనేదానిపై వెంటనే విచారణ జరుగుతోందని అన్నారు. ఈ ఘటన వెనుకు ఎవరైనా అధికారులు దోషులగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

సీజ్‌ చేసిన 13 ఐఏఎస్ కోచింగ్‌ సెంటర్లు ఇవే..

ఐఏఎస్‌ గురుకులం
చాహల్ అకాడమీ
ప్లూటస్ అకాడమీ
సాయి వర్తకం
ఐఏఎస్‌ సేతు
టాపర్స్ అకాడమీ
దైనిక్ సంవాద్
సివిల్ రోజువారీ ఐఏఎస్‌
కెరీర్ పవర్
99 నోట్లు
విద్యా గురు
గైడెన్స్ ఐఏఎస్‌
ఐఏఎస్‌లకు ఈసీ

చదవండి: సివిల్స్‌ కల జల సమాధి

   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)