Breaking News

రోడ్లను కమ్మేసిన పొగమంచు.. ప్రమాదాల్లో ఏడుగురి మృతి

Published on Sat, 01/17/2026 - 18:05

ఉత్తరప్రదేశ్‌ని పొగమంచు అతలాకుతలం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా  పొగమంచు తీవ్రంగా ఉండడంతో రోడ్డుపై ఏమి కనిపించక వాహనాలు ఎక్కడికక్కడ ఢీకొన్నాయి. దీంతో దాదాపు 7మంది ప్రాణాలు కోల్పోగా పెద్దఎత్తున ప్రజలు గాయపడ్డట్లు తెలుస్తోంది.

ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. శీతాకాలం కావడంతో దట్టమైన పొగమంచు రోడ్లపై అలుముకుంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో 40కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వాహనాలు ఢీకోనడంతో వేరువేరు ప్రమాద ఘటనల్లో ఏడుగురు మృతిచెందగా 50 మందికి పైగా గాయాలైనట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 100కు పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు  తెలిపారు.

ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లో అత్యంత కఠినమైన చలికాలం చిల్లైకలాన్ కొనసాగుతుంది. దీంతో కశ్మీర్ అంతటా ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లోకి వెళ్లాయి. అత్యధికంగా షోపియాన్ ప్రాంతంలో -5.6 డిగ్రీలు, శ్రీనగర్ -4 డిగ్రీలు, గుల్మార్గ్‌  -4.2 డిగ్రీలు, సోనామార్గ్ -2.9, పహల్గామ్‌ -2.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌లో చలికాలం అత్యంత ఎక్కువగా ఉండే కాలాన్ని చిల్లైకలాన్ అంటారు. ఇది డిసెంబర్ 21న ప్రారంభమై జనవరి 30 వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలలోకి వెళతాయి.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)