Breaking News

విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం.. జీపీఎస్‌ స్పూఫింగ్‌?

Published on Thu, 07/03/2025 - 07:22

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దీని వెనుక కుట్రకోణం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు సాగుతున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌మ మొహోల్‌ సైతం చెప్పారు. 

గ్లోబల్‌ పోజీషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) సంకేతాలను తారుమారు చేసి ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయేలా ఎవరైనా కుట్రలు సాగించారా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే 2023 నవంబర్‌ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశ సరిహద్దుల్లో 465 జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలు చోటుచేసుకున్నాయి. అమృత్‌సర్, జమ్మూ ప్రాంతాల్లో అధికంగా జరిగాయి. గత నెలలో ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన ఎయిర్‌ విమానం కొద్దిసేపటికే తిరిగివచ్చింది. జీపీఎస్‌ సంకేతాల్లో ఏదో తారుమారు జరుగుతున్నట్లు అనుమానాలు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు.  

పైలట్‌కు తప్పుడు సంకేతాలు  
భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన సి–130జే విమానం ఏప్రిల్‌లో మయన్మార్‌ గగనతలంపై ప్రయాణిస్తుండగా జీపీఎస్‌ స్పూఫింగ్‌ జరిగింది. దాంతో అప్రమత్తమై సురక్షితంగా ల్యాండ్‌చేశారు. జీపీఎస్‌ సిగ్నళ్లలోకి అపరిచితులు, విద్రోహులు చొరబడుతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. స్పూఫింగ్‌ లేదా జామింగ్‌ అనేది పెనువిపత్తుగా మారుతోంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్‌పోర్ట్‌ అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2023–2024 మధ్య జీపీఎస్‌లో ఇంటర్‌ఫియరెన్స్‌ రేటు 175 శాతం, జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలు 500 శాతం పెరిగాయి. స్ఫూపింగ్‌ లేదా జామింగ్‌ చేస్తే విమానం కాక్‌పిట్‌లోని పైలట్‌కు తప్పుడు మార్గం, తప్పుడు గమ్యస్థానం కన్పిస్తాయి. నిర్దేశిత మార్గంలో వెళ్లాల్సిన విమానం మరో మార్గంలో వెళుతుంది. విమానం ప్రయాణించాల్సిన ఎత్తులోనూ మార్పులు వస్తాయి. దాంతో గగతలంలో విమానాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎత్తయిన భవనాలు, కొండలను ఢీకొట్టొచ్చు. అలాగే రన్‌వే కిందికి దూసుకెళ్లడం కూడా జరగొచ్చు.  

కల్లోలిత ప్రాంతాల్లో అధికం.. 
యుద్ధాలు జరిగే కల్లోలిత ప్రాంతాల్లో జీపీఎస్‌ స్పూఫింగ్‌ సమస్య అధికంగా ఉంది. 2024లో ఆయా ప్రాంతాల్లో శాటిలైట్‌ సిగ్నల్‌ జామింగ్‌ లేదా స్పూఫింగ్‌ ఘటనలు 4.3 లక్షలు నమోదయ్యాయి. 2023లో 2.6 లక్షలు నమోదయ్యాయి. అంటే ఏడాది కాలంలో 62 శాతం పెరిగాయి. ఈజిప్టు, లెబనాన్, నల్ల సముద్రం, రష్యా–ఎస్తోనియా, రష్యా–లాతి్వయా, రష్యా–బెలారస్‌ సరిహద్దుల్లో స్ఫూపింగ్‌ బెడద ఎక్కువగా ఉందని ఎయిర్‌లైన్స్‌ సంస్థలు చెబుతున్నాయి. మయన్మార్‌తోపాటు భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దుల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ వైమానిక పరిశ్రమ ఎదుర్కొంటున్న సైబర్‌ దాడుల్లో జీపీఎస్‌ స్ఫూపింగ్, జామింగ్‌ కూడా ఒకటి. ఇలాంటి ఘటనలు తెలియపర్చడానికి అమెరికాలో ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిని్రస్టేషన్‌ ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)