Breaking News

భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై సీమా హైదర్‌ ఏమన్నదంటే..

Published on Sun, 02/23/2025 - 11:36

నోయిడా: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా  ఈరోజు(ఆదివారం ఫిబ్రవరి 23) భారత్-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందు సీమా హైదర్‌(Seema Haider) భారత జట్టకు శుభాకాంక్షలు తెలిపారు.  భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలవాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు  ఆమె చెప్పారు. భారత్‌ ఈ మ్యాచ్‌ గెలిస్తే దేశమంతటా సంబరాలు జరుగుతాయని సీమా హైదర్‌ పేర్కొన్నారు.

పాకిస్తాన్‌ నుంచి తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు భారత్‌ వచ్చిన సీమా హైదర్‌ ఎప్పుడూ భారత్‌కు మద్దతుపలుకుతూనే వస్తున్నారు. తాజాగా ఆమె ఇండియన్‌ క్రికెట్ టీమ్‌కు ‘బెస్ట్‌ ఆఫ్‌ లక్‌’ చెప్పారు. టీమిండియా ఎప్పటిలానే అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని అన్నారు.

భారత్‌- పాక్‌ మ్యాచ్‌(India-Pakistan match) చూసేందుకు తాను ఎంతో ఆతృతతో ఉన్నానని, భారత్‌ మ్యాచ్‌ గెలవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవడం దేశవాసులకు గర్వకారణంగా నిలుస్తుందని, అందరూ కలసి పండుగ చేసుకుంటారని సీమా పేర్కొన్నారు. ఈరోజు తన కుమార్తె పరీ పుట్టినరోజు కావడం విశేషమని, భారత్‌ గెలిస్తే కుటుంబ సభ్యులంతా  ఎంతో ఆనందంగా రెండు వేడుకలు చేసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ.. క్యాన్సర్‌ ఆస్పత్రికి శంకుస్థాపన

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)