Breaking News

‘సీమా హైదర్‌ చాలా డేంజర్‌’

Published on Wed, 05/15/2024 - 08:44

ప్రియుని కోసం పాక్‌ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా హైదర్ ఏదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ప్రియుడు సచిన్ మీనా కూడా వార్తల్లో కనిపిస్తున్నాడు. పాకిస్తానీ భాబీగా పేరొందిన సీమా హైదర్, ఆమె భారతీయ భర్త సచిన్ మీనాల సరిహద్దు ప్రేమ కథ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సీమా, సచిన్‌లు పిల్లలతో పాటు గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు.

తాజాగా సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ సన్నిహితుడొకరు సీమా హైదర్ గురించి మీడియాకు పలు సంచలన విషయాలు తెలిపారు. ఈ వివరాలు అందించిన వ్యక్తికి సీమాహైదర్‌తోనూ పరిచయం ఉంది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సీమా హైదర్ తరచూ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుకు వెళ్లేది. ఆమె కుటుంబ సభ్యులు పాకిస్తాన్‌ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆమె మేనమామ గులాం అక్బర్ పాకిస్తాన్ ఆర్మీలో ​అధి​కారిగా పనిచేస్తున్నాడు.

సీమా హైదర్ తన మామను కలవడానికి ఆర్మీ క్యాంపుకు ఒంటరిగా వెళ్లేది. అటువంటి సందర్భంలో చాలా రోజులు అక్కడే ఉండేది. సీమాకు కంప్యూటర్‌కు పరిజ్ఞానం ఉంది. దీంతో ఆమె ఆర్మీ క్యాంపులో గూఢచర్యానికి సంబంధించిన శిక్షణ ఇచ్చి ఉండవచ్చని గులాం హైదర్‌ సన్నిహితుడు అనుమానం వ్యక్తం చేశాడు.

ఈ వివరాలు వెల్లడించిన వ్యక్తి భారత్‌కు చెందిన గులాం హైదర్ లాయర్ మోమిమ్ మాలిక్‌తో టచ్‌లో ఉన్నాడని సమాచారం. కాగా ఈ ఇన్‌ఫార్మర్ ఎవరనే విషయాన్ని మోమిమ్ వెల్లడించనప్పటికీ ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ తన వద్ద ఉందని, దానిని కోర్టుకు సమర్పిస్తానని ఆయన తెలిపారు.

సీమా హైదర్ పాక్‌ భర్త గులాం హైదర్‌ తన పిల్లలను తన దగ్గరకు తెచ్చుకునేందుకు సీమాపై కేసు పెట్టారు. సచిన్‌తో సీమా వివాహం చట్టవిరుద్ధమని, వారి పిల్లలపై సీమాకు ఎలాంటి హక్కు లేదని గులాం తరపు న్యాయవాది మోమిమ్‌ పేర్కొన్నారు.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)