రాముడి పాటపాడి మరోసారి వార్తల్లోకి సీమా హైదర్‌

Published on Sat, 01/20/2024 - 17:47

ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తన ప్రియుడు సచిన్‌ మీనాతో కలిసి ‍గ్రేటర్‌ నోయిడాలోని రఘుపూర్‌లో నివసిస్తున్న ఈ మహిళా.. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ముస్లిం మహిళ అయిన సీమా.. హిందూ ఆరాధన చేయడం విశేషంగా నిలిచింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్‌ చాలీసా పఠించడం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సచిన్‌-సీమా నివసించే రబూపురాలో ఇటీవల రాముడి భజన ఏర్పాటు చేశారు. రాముడి కీర్తనలు, హానుమాన్‌ పాటలు పాడారు. ఈ సందర్భంగా సీమా.. స్వాతి మిశ్రా పాడిన ‘రామ్‌ ఆయేంగే’ అనే పాటను ఆలపించారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి ఆమె ఎంతో చక్కగా పాట పాడారు. ఆమెతోపాటు తన కుమారుడు కూడా హనుమాన్‌ చాలిసా పఠించాడు. ఆమె వెంట న్యాయవాది ఏపీ సింగ్‌ కూడా ఉన్నారు. ఈ వీడియోను ఆమెనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనుమతి లభించిన వెంటనే తన కుటుంబంతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి రామదర్శనం కోసం వెళతానని తెలిపారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. భారత్‌ మహిళలను గౌరవించే దేశమని అన్నారు. తను ఇప్పుడు పూర్తిగా హిందూ మతంలోకి మారినట్లు తెలిపారు.  ఆమె శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని అన్నారు.

కాగా.. ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌తో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్‌లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలుస్తోంది. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తూ నెటిజన్లకు టచ్‌లో ఉంటున్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)