Breaking News

మరో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టుల మృతి?

Published on Fri, 06/06/2025 - 17:23

చత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈరోజ(శుక్రవారం) జిల్లాలోని నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.  

భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో  మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా బండి ప్రకాష్‌  మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాష్‌. సింగరేణి కార్మిక సమాఖ్య ఇంచార్జ్‌గా పనిచేశారు.

కాగా, నిన్న(గురువారం) . బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నరసింహ అలియాస్‌ సుధాకర్‌ మృతిచెందారు.  నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు  జరిగిన ఎదురుకాల్పుల్లో సుధాకర్‌ మృత్యువాత పడ్డారు.

ఆపరేషన్‌ కగార్‌, ఆపరేషన్‌ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం చర్యలు చేపట్టింది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా అ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను  ఇటీవల  పోలీసులు అరెస్ట్‌ చేయగా, తాజాగా మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.  కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా  ఉన్నారు సుధాకర్‌. అయితే గత ఆరు నెలల్లో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. సుధాకర్‌పై రూ. కోటి రివార్డు ఉంది.  2004లో ప్రభు త్వంతో జరిగిన చర్చల్లో సుధాకర్‌  పాల్గొన్నారు.

కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి.  ఇది గతేడాది నుంచి  ఊపందుకోగా, ఈ  ఆపరేషన్ అనేక మంది మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. దేశ వ్యాప్తంగా మావో​యిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం తన చర్యలను ముమ్మరం చేసింది.  

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)