పార్లమెంట్‌లోకి చొరబాటు యత్నం 

Published on Fri, 08/22/2025 - 10:44

న్యూఢిల్లీ: ఓ ఆగంతకుడు పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచాడు. నిచ్చెన సహాయంతో లోపలికి ప్రవేశించాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో రైల్‌ భవన్‌ వైపు నుంచి గోడ ఎక్కి పాత పార్లమెంట్‌ భవనం గరుడ ద్వారం వరకు చేరుకోగలిగాడు. కాంప్లెక్స్‌ లోపల మోహరించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. 

దుండగుడు ఉత్తరప్రదేశ్‌ నివాసి రామ్‌కుమార్‌ బింద్‌(20) అని, గుజరాత్‌లోని సూరత్‌లో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని అధికార వర్గాలు తెలిపాయి. అదుపులోకి తీసుకున్న సమయంలో అతను మానసికంగా బాధపడుతున్నట్లు తెలిసింది. తాను ఇంటికి వెళ్లాలనుకుంటున్నానని, పార్లమెంట్‌కు చేరుకునే ముందు రైల్వే స్టేషన్‌కు కూడా వెళ్లానని, కానీ రైలు ఎక్కలేకపోయానని విచారణలో చెప్పాడు.

 ప్రస్తుతం, పార్లమెంట్‌ భద్రతా విభాగం అతడిని ప్రశ్నిస్తోంది. ప్రాథమిక విచారణ పూర్తయిన తరువాత చొరబాటుదారుడిని స్థానిక పోలీసులకు విచారణ కోసం అప్పగిస్తామని అధికారులు తెలిపారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరిగింది. ఉల్లంఘన జరిగిన సమయంలో పార్లమెంటు సభ్యులెవరూ అక్కడ లేరు. ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంట్‌ భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.    

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)