Breaking News

విజయ్ ఇంట్లోకి చొరబడ్డ అగంతకుడు

Published on Fri, 09/19/2025 - 15:33

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత  విజయ్‌ ఇంట్లోకి అగంతకుడు చొరబడడం కలకలం రేపుతోంది. ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని నీలంకరైలో విజయ్‌ ఇంటి అగంతకుడు టెర్రస్‌పై తిరుగుతుండగా భద్రతా సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది ఆయన నివాసంలో బాంబ్‌ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టింది. ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, 24 ఏళ్ల మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిగా పోలీసులు నిర్థారించారు. ఈ ఘటనను సంబంధించి ఓ పోలీసు సీనియర్‌ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మానసిక ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. గట్టి భద్రతా ఏర్పాట్లను దాటి ఆ వ్యక్తి విజయ్‌ ఇంట్లోకి ఎలా ప్రవేశించగలిగాడన్న దానిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

విజయ్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ Y-కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. విజయ్.. గత శనివారం తిరుచ్చిలో రాష్ట్రవ్యాప్తంగా తన రాజకీయ పర్యటనను ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరగడంతో ఆయన భదత్రా విషయంలో అభిమానులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

 

 

 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)