Breaking News

Sculptor Arun Yogiraj: రామ్‌లల్లా విగ్రహం ఖరారు

Published on Wed, 01/17/2024 - 04:27

మైసూర్‌: అయోధ్య రామమందిరంలో ప్రతిష్టించబోయే రామ్‌లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఖరారు చేసింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించిన ప్రతిమకు ఆ మహద్భాగ్యం దక్కనుంది. ఈ నెల 22న గర్భాలయంలో విగ్రహం ప్రాణపత్రిష్ట జరుపుకోనుంది. అయోధ్య ఆలయంలో ప్రతిష్టించడానికి మూడు విగ్రహాలను చెక్కించారు. వీటిలో అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కిన శిల్పాన్ని ఎంపిక చేశారు.

ఈ విగ్రహం ఐదేళ్ల బాలరాముడి రూపంలో ఉందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. నిల్చున్న రూపంలోనే విగ్రహాన్ని తయారు చేయించామని చెప్పారు. రామ్‌లల్లా విగ్రహాన్ని ఈ నెల 18వ తేదీన గర్భాలయంలోని ఆసనంపైకి చేరుస్తామని వెల్లడించారు. బాలరాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంతగానో శ్రమించారని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అరుణ్‌ యోగిరాజ్‌ కుటుంబ సభ్యులు మంగళవారం చెప్పారు. రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కుతుండగా గాయం వల్ల ఆయనకు కంటి నొప్పి వచి్చందని అన్నారు.

యోగిరాజ్‌ రూపొందించిన శిల్పాన్ని తీర్థ క్షేత్ర ట్రస్టు ఎంపిక చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ మహాకార్యం కోసం దేవుడు తన భర్తను ఎన్నుకొని ఉండొచ్చని యోగిరాజ్‌ భార్య విజేత అన్నారు. ఇది తమకు మర్చిపోలేని రోజు అని యోగిరాజ్‌ సోదరుడు సూర్యప్రకాశ్‌ పేర్కొన్నారు. వార్త తెలిసిన తర్వాత తమకు చెప్పలేనంత ఆనందంగా ఉందని ఆయన తల్లి సరస్వతి అన్నారు. అరుణ్‌ యోగిరాజ్‌ గొప్ప శిల్పిగా ప్రఖ్యాతిగాంచారు. కేదార్‌నాథ్‌లో ప్రతిష్టించిన ఆది శంకరాచార్య, ఢిల్లీలో ఇండియా గేట్‌ వద్ద నెలకొల్పిన సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాలను ఆయనే రూపొందించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)