Breaking News

పొట్టలో మర్చిపోయిన కత్తెరను  17 ఏళ్ల తర్వాత తీశారు!

Published on Sun, 03/30/2025 - 06:43

లక్నో: సిజేరియన్‌ సమయంలో మహిళ పొట్టలోనే కత్తెరను మర్చిపోయి కుట్లేశాడో వైద్యుడు. 2008లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 17 ఏళ్ల పాటు కడుపు నొప్పితో ఎంతో బాధపడింది ఆ మహిళ. చివరికి ఎక్స్‌ రేతో పొట్టలో కత్తెర ఉన్న విషయం తెల్సి ఆపరేషన్‌తో వెలుపలికి తీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంధ్యా పాండే అనే మహిళకు 2008 ఫిబ్రవరి 28వ తేదీన లక్నోలోని ‘షీ మెడికల్‌ కేర్‌’ఆస్పత్రిలో సిజేరియన్‌తో కాన్పు చేశారు. ఆ సర్జరీ జరిగినప్పటి నుంచి పొట్టలో విపరీతమైన బాధతో ఇబ్బంది పడుతున్నారు. ఎందరో డాక్ట ర్ల వద్దకు వెళ్లారు. అయినా ఉపశమనం దొరకలేదు. 

ఇటీవల సంధ్యా పాండే వైద్య పరీక్షల కోసం లక్నోలోని మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎక్స్‌ రే కూడా తీశారు. ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు ఎక్స్‌ రే రిపోర్టుతో తెలిసింది. దీంతో ఆమె కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేరారు. మార్చి 26వ తేదీన ఆపరేషన్‌ చేసి వైద్యులు కడుపులో ఉన్న కత్తెరను బయటకు తీశారు. ఎంతో సంక్లిష్టమైన ఆపరేషన్‌ ద్వారా కత్తెరను బయట కు తీశామని, కోలుకున్నాక సంధ్యా పాండేను డిశ్చార్జి చేశామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సంధ్య భర్త అరవింద్‌ కుమార్‌ పాండే ఫిర్యాదు మేరకు సిజేరియన్‌ చేసిన డాక్టర్‌ పుష్పా జైశ్వాల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)