Breaking News

కృత్రిమ గర్భాశయం!

Published on Wed, 12/24/2025 - 04:36

నెలలు నిండకుండానే జననం. నవజాత శిశు మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఈ సమస్యకు సైంటిస్టులు తాజా వినూత్న పరిష్కారం కనిపెట్టారు. అదే... కృత్రిమ గర్భాశయం! 

37 వారాలు నిండకముందే పుడితే నెల తక్కువ శిశువు అంటారు. అదే 23 నుంచి 27వ వారం మధ్యలోనే, అంటే ఆరు లేదా ఏడు నెలలకే కాన్పు జరిగితే అలాంటి శిశువు బతకడం చాలాసార్లు కష్టమవుతుంది. అంత లేత ఊపిరితిత్తులు బయటి ప్రపంచపు పరిస్థితులను తట్టుకునేందుకు అనువుగా ఉండవు. 

మిగతా కీలక శరీరాంగాలదీ అదే పరిస్థితి. ఆస్పత్రుల్లో ఇంక్యూబేటర్లలో ఉంచినా, ఎంత వైద్య చికిత్స అందించినా చాలాసార్లు లాభముండదు. అలాంటి శిశువుల్లో ఎక్కువమంది మృత్యువాత పడుతుంటారు. సైంటిస్టులు రూపొందించిన కృత్రిమ గర్భాశయం ఇందుకు పరిష్కారంగా కనిపిస్తోంది. ఇందులో ఉమ్మ నీటితో సహా అన్నీ అచ్చం అమ్మ గర్భంలో లాంటి పరిస్థితులే ఉండటం విశేషం! 

సంక్లిష్టమే 
కృత్రిమ గర్భాశయం ఆలోచన వినేందుకు సింపుల్‌ గానే ఉన్నా దాని రూపకల్పన మాత్రం చాలా సంక్లిష్టం. అది పరిమాణంలో దాదాపు ఇళ్లలో పెట్టుకునే సాధారణ అక్వేరియాల మాదిరిగా ఉంటుంది. సిజేరియన్‌ ద్వారా పుట్టిన నెలలు నిండని శిశువును వెంటనే ఉమ్మనీటితో నిండిన సంచీలో పెడతారు. అక్కడ శిశువుకు వెచ్చదనంతో పాటు తల్లి గర్భంలోని అన్ని పరిస్థితులూ అమరుతాయి. మరి పుట్టిన క్షణం నుంచీ అతి కీలకంగా మారే శ్వాసక్రియ పరిస్థితి ఏమిటంటారా? దానికీ మార్గం కనిపెట్టారు. బొడ్డుతాడుకు అనుసంధానించి సింథటిక్‌ ఉమ్మసంచీ ద్వారా శిశువుకు నిరంతరం ఆక్సిజన్‌ అందుతూ ఉంటుంది.

ఈ కృత్రిమ గర్భాశయంలో అవసరాన్ని బట్టి కొద్ది రోజులు, వారాల నుంచి నెల, ఆపైన కూడా ఉంచే వెసులుబాటు ఉందంటున్నారు దీన్ని రూపొందించిన సైంటిస్టులు. అయితే ఈ కృత్రిమ గర్భాశయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఒకటి రెండేళ్ల కన్నా ఎక్కువే పట్టవచ్చట. కానీ ఈ పద్ధతిపై ఇప్పటికే నైతిక తదితర సందేహాలు తలెత్తుతుండటం విశేషం! అవన్నీ తీరి, నెలలు నిండకుండా పుట్టే ప్రతి పాపాయీ బతికి బట్ట కట్టే రోజు వస్తే బాగుంటుంది కదా అన్నది సైంటిస్టుల మాట.   –సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)