Breaking News

పార్కింగ్‌ వివాదం.. సైంటిస్టు దారుణ హత్య

Published on Thu, 03/13/2025 - 12:57

మొహాలీ: పంజాబ్‌లోని మొహాలీ(Mohali)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదం హత్యకు దారితీసింది. మొహాలీ లోని సెక్టార్‌-66లో బైక్‌ పార్కింగ్‌ విషయమై జరిగిన వివాదంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌)కు చెందిన సైంటిస్టు హత్యకు గురయ్యారు.

ఈ ఘటనా క్రమమంతా అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యింది. మృతుడిని సైంటిస్టు(Scientist) అభిషేక్‌ స్వర్ణకార్‌(30)గా గుర్తించారు. ఇతని స్వస్థలం జార్ఖండ్‌. పొరుగింట్లో ఉంటున్న మోంటీ అనే వ్యక్తి అభిషేక్‌పై దాడి చేశాడని, ఈ నేపద్యంలో అభిషేక్‌ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అభిషేక్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారునికి ఇటీవలే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ జరిగిందని, ప్రస్తుతం డయాలసిస్‌ కొనసాగుతున్నదని వారు తెలిపారు.

అభిషేక్‌ తన తల్లిదండ్రులతో పాటు సెక్టార్‌-66లోని ఒక అద్దె ఇంటిలో ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో అతను వాహనాన్ని పార్కింగ్‌ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని పొరుగింటిలో ఉంటున్న మోంటీతో వివాదం చెలరేగింది. ఈ సమయంలో మోంటీ తన ఎదురుగా ఉన్న అభిషేక్‌పై దాడి చేశాడు. అతని పొట్ట, ఛాతీపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో అభిషేక్‌ బాధతో విలవిలలాడుతూ కిందపడిపోయాడు. దీనిని గమనించిన అభిషేక్‌  కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే అభిషేక్‌​ మృతిచెందాడని నిర్ధారించారు. సీసీటీవీలో లభ్యమైన ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)