Breaking News

పండుగలప్పుడు ఛార్జీల పెంపా?

Published on Tue, 01/20/2026 - 06:27

న్యూఢిల్లీ: పండుగల రద్దీని అవకాశంగా తీసుకుని విమాన ప్రయాణ ఛార్జీలను అమాంతంగా పెంచేయడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చార్జీలను ఆకస్మిక పెంచి విమానయాన సంస్థలు సాగిస్తున్న దోపిడీపై జోక్యం చేసుకోక తప్పదని స్పష్టం చేసింది. ప్రైవేట్‌ విమానయాన సంస్థలు ఆకస్మికంగా పెంచుతున్న చార్జీలు, అదనపు రుసుములను నియంత్రించడానికి తగు మార్గదర్శకాలను రూపొందించాలంటూ దాఖలైన పిల్‌పై సోమవారం జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది.

 ‘మేం ఈ విషయంలో కచ్చితంగా జోక్యం చేసుకుంటాం. కుంభమేళా, ఇతర పండగల సమయాల్లో ప్రయాణి కులను ఎలా దోచుకుందీ చూశాం. తాజాగా, ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్, జోథ్‌పూర్‌లకు చార్జీలను ఆకస్మికంగా పెంచేశారు’అని ధర్మాసనం పేర్కొంది. విమాన ప్రయాణ చార్జీల్లో పారదర్శకత, ప్రయాణికుల హక్కుల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలంటూ సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణన్‌ వేసిన పిటిషన్‌పై గతేడాది నవంబర్‌ 17వ తేదీన విచారణ చేపట్టిన ధర్మాసనం..కేంద్రం, డీజీసీఏ తదితరులకు నోటీసులు జారీ చేసింది. 

సోమవారం విచారణ సందర్భంగా సమాధానం ఇచ్చేందుకు మరింత గడువు కావాలని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ కౌశిక్‌ కోరడంతో ధర్మాసనం తదుపరి విచా రణను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు గతంలో 25 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉండగా ప్రైవేట్‌ విమానయాన సంస్థలు దాన్ని 15 కిలోలకు ఏకపక్షంగా తగ్గించి వేశాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం విమాన చార్జీలను, ఇతర అదనపు రుసుములను సమీక్షించేందుకు గానీ, గరిష్ట పరిమితిని నిర్ణయించేందుకు గానీ అధికారం ఏ వ్యవస్థకూ లేకపోవడంతో విమానయాన సంస్థలు వివిధ రూపాల్లో ప్రయాణికులను దోచుకుంటున్నాయని ఆరోపించారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)