Breaking News

ఏప్రిల్ 4 వరకు అక్కడ స్కూళ్లు బంద్.. కారణమిదే..!

Published on Sun, 04/02/2023 - 19:01

పాట్నా: బిహార్ రోహ్తాస్‌ జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు 144 సెక్షన్ విధించారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 4వరకు సెలవులు ప్రకటించారు. కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లను కూడా తెరవొద్దని నిర్వాహకులకు తెలిపారు.

కేంద్రహోమంత్రి అమిత్‌షా పర్యటనకు ముందు మార్చి 31న నలంద జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఆ తర్వాత రోహ్తాస్‌ జిల్లాలోనూ గురువారం ఘర్షణలు చెలరేగాయి. శనివారం వరకు ఇవి కొనసాగాయి. ఈనేపథ్యంలోనే ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. పోలీసు బలగాలను రంగంలోకి దించి పటిష్టభద్రతా ఏర్పాట్లు చేశారు. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు.

ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 50మందినిపైగా అరెస్టు చేశారు. పలుకేసులు నమోదు చేశారు. బిహార్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షా కూడా శాంతిభద్రతల దృష్ట్యా తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)